Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి ఆర్టీసీ రూ.35 కోట్లు బాకీ... ఎందుకంటే...

మీరు విన్నది నిజమే. తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఏపీఎస్‌ఆర్టీసీకి మధ్య కొత్త వివాదం ఒకటి మొదలైంది. ఆర్టీసీ నుంచి తమకు రూ.35 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని తితిదే నోటీస

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (16:07 IST)
మీరు విన్నది నిజమే. తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఏపీఎస్‌ఆర్టీసీకి మధ్య కొత్త వివాదం ఒకటి మొదలైంది. ఆర్టీసీ నుంచి తమకు రూ.35 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని తితిదే నోటీసులు ఇచ్చింది. అంత మొత్తం తాము చెల్లించలేమని ఆర్టీసీ అంటుంటే.. తాము కేటాయించిన స్థలాలు ఖాళీ చేయమని తితిదే కోరుతోంది. అసలెందుకు తితిదే, ఆర్టీసీ మధ్య నోటీసులు వరకు ఎందుకు వెళ్ళిందో తెలుసుకుందాం...
 
ఒకప్పుడు తిరుమల - తిరుపతి మధ్య తితిదేనే బస్సులు నిర్వహించేది. 1975 సంవత్సరంలో రవాణా బాధ్యతను ఆర్టీసీకి అప్పగించింది. ఆ సమయంలో తన వద్ద ఉన్న బస్సులను, సిబ్బందిని, బస్టాండ్‌ను ఆర్టీసీకి అప్పగించింది. అప్పటినుంచి ఆర్టీసీనే తిరుమల - తిరుపతి మధ్య భక్తులను తరలిస్తోంది. ఆ తర్వాత పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీని విస్తరించాల్సి వచ్చింది. ఇందుకోసం తితిదే అనేక స్థలాలను ఆర్టీసీకి కేటాయించింది. 
 
తిరుపతిలో ఆర్టీసీ గ్యారేజీ దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది తితిదే స్థలమే. అలిపిరి డిపో ఐదు ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇంకా తిరుమల బాలాజీ బస్టాండు, పాపనాశనం బస్టాండు, తిరుమల బస్టాండు, తిరుపతిలో లింకు బస్టాండు, ఎకరాల కొద్దీ తితిదే స్థలాలను ఆర్టీసీకి అప్పగించింది. 1975వ సంవత్సరంలో ఆర్టీసీకి, టిటిడికి మధ్య ఒప్పందం కుదిరిన సమయంలో తితిదే తన స్థలాలకు మాత్రం మామూలు రేట్ల ప్రకారం నిర్ణయించింది. తితిదే నిబంధనల ప్రకారం లీజు పెరుగుతోంది.
 
తితిదే నుంచి తీసుకున్న స్థలాలకు ఆర్టీసీ లీజు చెల్లించింది లేదు. తితిదే కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. తితిదేకి ఇటీవల స్థలాల అవసరం పెరుగుతోంది. ఈ క్రమంలోనే తితిదే పరిపాలనా భవనానికి ఎదురుగా ఉన్న గ్యారేజీ అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ చెల్లించాల్సిన లీజులపై ఒక కమిటీనీ వేసి అధ్యయనం చేశారు. మొత్తంగా ఇప్పటిదాకా ఆర్టీసీ 35కోట్ల దాకా తితిదేకి చెల్లించాల్సి ఉందని లెక్కలు తేల్చారు. 
 
ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారులకు తెలియజేసి ఆ మొత్తం చెల్లించమని కోరారు. అయితే అంత మొత్తం తాము చెల్లించలేమని, లక్షల్లో మాత్రమే చెల్లించగలమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ వల్ల యాత్రికులకు భద్రమైన రవాణా వ్యవస్థ ఏర్పాటైంది. ఈ విషయం తితిదే అధికారులకూ, ఇలాంటి సంస్థ విషయంలో తితిదే అంత కఠినంగా ఉంటుందని అనుకోలేం. కానీ సమస్య కొలిక్కి రాలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. 
 
తితిదేకి చెల్లించాల్సిన లీజుపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిపితే ఆర్టీసీకి ఊరట లభించే అవకాశాలున్నాయి. తిరుమల - తిరుపతి మధ్య యాత్రికులను తరలించడంలో ఆర్టీసీ పోషిస్తున్న పాత్ర అందరికీ తెలిసిందే. రూ.35 కోట్లు తాము చెల్లించలేమని ఆర్టీసీ చెబితే తితిదే ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడించవచ్చు. అయితే ఆర్టీసీ ఉన్నతాధికారుల్లో అలాంటి చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఆర్టీసీని క్రమంగా నిర్వీర్యం చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో దీంతో ఆ స్థలాన్ని తితిదేకి తిరిగి అప్పగించడానికి సిద్ధమయ్యారు. అందుకే మిగతా స్థలాల విషయంపైనా తితిదేతో సీరియస్‌గా చర్చించడం లేదన్న విమర్సలు వినిపిస్తున్నాయి.
 
తితిదే లీజు అడుగుతోందన్న పేరుతో తిరుపతిలోని ఆర్టీసీ గ్యారేజీని మూసేసి నెల్లూరుకు తరలించారని చూస్తున్న యాజమాన్యంపై కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుపతిలో గ్యారేజీ లేకపోతే తిరుమల - తిరుపతి మధ్య బస్సులు నడపడానికి ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. తిరుమల బస్సులు ఎప్పుడూ మంచి కండిషన్‌లో ఉండాలి. ఏ విడిభాగం మార్చాల్సి ఉన్నా అప్పటికప్పుడు మార్చాలి. గ్యారేజీ ఇక్కడే ఉండడం వల్ల అప్పటికప్పుడు తిరుమల  బస్సులకు విడిభాగాలు మార్చి ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. 
 
అదే గ్యారేజీ నెల్లూరుకు తరలిపోతే తిరుమల బస్సుల మరమ్మత్తులకూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ కోణంలోనైనా ఆర్టీసీ గ్యారేజీని తిరుపతిలోనే కొనసాగించేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వ స్థాయిలో తితిదేలో చర్చలు జరిపి, నామమాత్రపు లీజుతో ఆర్టీసీ సంస్థలను కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments