Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో జయను జైల్లో పెట్టినా... కరుణను ఈడ్చుకెళ్లినా చూపించారు... ఇక్కడ ముద్రగడ ఆందోళన అంటే 'సాక్షి' కట్టా...?

ప్రజాసామ్య వ్యవస్థలో మీడియాకు ఉన్న ప్రాధాన్యత అగ్రగణ్యమైనది. ప్రజాభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొనివెళ్తూ, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకొనివెళ్తూ ప్రభుత్వానికి-ప్రజలకు మీడియా వారధిగా ఉంటుంది. అలాంటి మీడియాపై అధికార ప్రభుత్వాలు కక్షసాధింపు

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (14:42 IST)
ప్రజాసామ్య వ్యవస్థలో మీడియాకు ఉన్న ప్రాధాన్యత అగ్రగణ్యమైనది. ప్రజాభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొనివెళ్తూ, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకొనివెళ్తూ ప్రభుత్వానికి-ప్రజలకు మీడియా వారధిగా ఉంటుంది. అలాంటి మీడియాపై అధికార ప్రభుత్వాలు కక్షసాధింపు చర్యలకు పాల్పడం ఎంతమాత్రం సహేతుకం కాదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని పత్రికలు, టివీ ఛానాళ్ళు భారతదేశంలో ఉన్నాయి. 
 
ఐతే ఈ మీడియా సరియైన పాత్ర పోషిస్తుందా లేదా అనేదే సందేహాస్పదం. కొన్ని పత్రికలు - టివీ ఛానాళ్ళు రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తూ, వ్యక్తి ఆరాధన చేస్తూ మీడియా విలువలను మంటగలుపుతున్నాయి. ఈమధ్య కాలంలో ప్రతి రాజకీయ పార్టీ ఒక పత్రికను, ఒక టివీ ఛానల్‌ను పెట్టుకోవడం పరిపాటైపోయింది. ఈ టివీ ఛానాళ్ళు తమ పార్టీ నాయకులను ఆకాశానికి ఎత్తుతూ, తమ వ్యతిరేక పార్టీ నాయకులను నిత్యం విమర్శలతో ముంచెత్తుతూ ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు తమ పక్షపాత మీడియాను భూజానికెత్తుకుంటూ, తమ వ్యతిరేక మీడియాను కాలారాసే ప్రయత్నం చేస్తున్నాయి. 
 
మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గమనిస్తే... తెలంగాణా అధికారంలో వచ్చిన కె.సి.ఆర్. తనకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తున్న టివీ9, ఎ.బి.యన్ వార్త ఛానాళ్ళ ప్రసారాలను తెలంగాణాలో అప్పట్లో నిలిపివేశారు. ఆ సమయంలో అన్ని టీవీ ఛానాళ్ళు, రాజకీయ పార్టీలు ఆ ఘటనను ఖండిస్తే పరిస్థితి మరోవిధంగా ఉండేది. కేవలం కొన్ని టీవీ ఛానళ్ళు, కొందరు మేథావులు, కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే తమ నిరసన గళాన్ని విప్పాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఓటుకు నోటు కేసు దుమారం చెలరేగుతున్న సందర్భంలో కొన్ని రోజుల పాటు ఇక్కడ ఎన్‌టి.వీ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. 
 
తాజాగా తుని సంఘటనలో ప్రభుత్వం అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్న నేపథ్యంలో అక్కడి సంఘటనలను, నిరసనలను ప్రసారం చేస్తుందన్న సాకుతో సాక్షి టివీ ప్రసారాలను నిలిపివేసింది. అట్లే నెంబర్ వన్ ఛానల్ ప్రసారాలను కూడా కొన్ని ప్రాంతాలలో నిలిపివేశారు. ఈ సంఘటనలు జరిగినప్పుడు తెలంగాణాలో ప్రసారాలు నిలిపివేయబడిన టివీ ఛానళ్ళు మిన్నకున్నాయి. తెలంగాణాలో టివీ ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేసినప్పుడు ఇక్కడి ప్రతిపక్ష నాయకుడు నోరు మెదపలేదు. చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రభుత్వాధినేతపై విరుచుకుపడ్డారు. 
 
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వాధినేత సాక్షి ప్రసారాలను నిలిపివేయగా, ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇక్కడ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రక్క రాష్ట్రమైన తమిళనాడును గమనిస్తే అక్కడ రాజకీయ పార్టీల మధ్య పోటీ ఇక్కడ కంటే తీవ్రస్థాయిలో ఉంటుంది. కానీ అక్కడ ఇలాంటి చర్యలు జరిగిన దాఖలాలు లేకపోవడం అభినందనీయం. కరుణానిధిని జయలలిత ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు డి.యమ్.కె. సమర్థనీయ ఛానల్ జెమినీ టివీ ఆ సంఘటనను తన ప్రసారాలను అగ్రస్థానంలో నిల్పి తదుపరి ఎన్నికల్లో లాభపడింది. అలాంటి తరుణంలో కూడా అక్కడ అధికారంలో ఉన్న అన్నా డి.యమ్.కె, ప్రభుత్వం ప్రసారాలను నిలిపివేయలేదు. ఇలాంటి చర్యలకు అక్కడి ప్రభుత్వాలు పాల్పడంలేదు.  
 
తెలుగు రాష్ట్రాలలోనే ఇలాంటి విపత్కర పరిస్థితులు  చోటుచేసుకోవడం బాధకరం. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా అన్ని రాజకీయ పార్టీలు, అందరూ జర్నలిస్టులు, మేథావులు, మీడియా అధినేతలు ఏకతాటిపై నలిచి, తమ నిరసన గళాన్ని విప్పాలి. మీడియా గొంతు నొక్కినంత మాత్రాన, తాము చేసిన తప్పులు ఒప్పులై పోవని, ప్రజలను ఎంతోకాలం మోసం చేయలేమనే  గ్రహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు ఎవరు చేసినా అన్ని వర్గాలు ఏకపక్షంగా ప్రతిఘటించాలి.

సమాజ శ్రేయస్సు విషయంలో ప్రభుత్వాల కంటే కూడా మీడియాకే ఎక్కువ బాధ్యత ఉందనే విషయాన్ని మీడియా సంస్థలు అధినేతలు మర్చిపోకూడదు. ప్రజలను రెచ్చగొట్టడం, తిమ్మిని బమ్మి చేయడం లాంటి చర్యలను మానుకోవాలి. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు సమన్వయంతో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణలో భాగస్వాములు కావాల్సివుంది. అలాంటి సహృద్భావ వాతావరణం ఇక ముందైనా తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకోవాలని ఆశిద్దాం.
డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్(తెనాలి)        

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments