రాజకీయాల్లోకి వస్తున్న కోలీవుడ్ అగ్ర హీరో.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (12:07 IST)
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది నటీనటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణించారు. తమిళనాడును పాలించిన రాజకీయ నేతల్లో అత్యధిక శాతం కోలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందినవారే. వారిలో దివంగత ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు ప్రధానం. ఇపుడు మరో అగ్రహీరో రాజకీయాల్లోకి రానున్నారు. ఆయన దళపతి విజయ్ అలియాస్ విజయ్ జోసెఫ్. వచ్చే యేడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నారు. 
 
వచ్చే లోక్ సభ ఎన్నికల్లోపే రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం సంఘ సేవ కోసం స్థాపింపిన తన విజయ్ మక్కల్ ఇయక్కమ్ సంస్థను రాజకీయ పార్టీగా మారుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో పది, ఇంటర్, పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జిల్లాలవారీగా ఉపకార వేతనాలు అందించారు. సంస్థ నిర్వాహకులతో ఈ మధ్య విజయ్ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఏర్పాటు దిశగా చర్చిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ప్రజలకు సంస్థ కార్యకలాపాలను క్షణాల్లో చేర్చే దిశగా సోషల్ మీడియా, ఐటీ విభాగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించారు. సంస్థలో సాంకేతిక విభాగం సభ్యుల సంఖ్యను 30 వేలకు పెంచాలని కూడా నిర్ణయించారు. అలాగే, విజయ్ మక్కల్ ఇయక్కమ్‌ను ప్రస్తుతం 1600 వాట్సప్ గ్రూపులు పనిచేస్తున్నాయి. వీటి సంఖ్యను నెల రోజుల్లోనే 10 వేలకు పెంచాలని విజయ్ ఆదేశించారు. అలా కింది స్థాయి నుంచి ఆయన తన రాజకీయ పునాదులను నిర్మించుకుంటూ వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments