Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుల్ కిక్కు.. మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ కిక్కేచ్చేసింది. డిసెంబర్ 31, జనవరి 1 రోజున మద్యం షాపులపై ఎలాంటి నిషేధం లేదని రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి.వాసుదేవ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు నిత్యం పనిచేస్తున్న విధంగానే నూతన సంవత్సరం సమయంలో ఈనెల 31న కూడా పనిచేస్తాయన్నారు.
 
రోజువారీ సమయాల్లోనే పనిచేస్తాయని.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా ఈనెల 31న మద్యం దుకాణాలు,బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపార సమయాల్లో మార్పులు ఏమైనా ఉన్నాయాయని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తన కార్యాలయానికి అనేక ఫోన్ కాల్స్ వస్తుండటంతో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాలు ఉదయం 11గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ పనిచేస్తాయన్నారు. 
 
ఈ నెల 31న కూడా అదే సమయాల్లో పనిచేస్తాయని.. ఈ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఉండటంతో ఈ నెల 31న, జనవరి 1న పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో క్లారిటీ వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments