Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాది గ‌డిచింది... అమ‌రావ‌తిలో ఏం మిగిలింది? అదే నీరు, మ‌ట్టి...

అమ‌రావ‌తి: ప్రపంచ స్థాయి నిర్మాణాలతో న‌భూతో న‌భ‌విష్య‌తే అన్న‌ట్లు నిర్మించాల‌నుకున్న అమ‌రావ‌తి రాజ‌ధానికి స‌రిగ్గా ఏడాది కాలం గ‌డిచింది. స‌రిగ్గా అక్టోబ‌రు 22న రాజధాని నగరానికి అమరావతిగా పేరు పెట్టి... ఆ రోజే నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (13:51 IST)
అమ‌రావ‌తి: ప్రపంచ స్థాయి నిర్మాణాలతో న‌భూతో న‌భ‌విష్య‌తే అన్న‌ట్లు నిర్మించాల‌నుకున్న అమ‌రావ‌తి రాజ‌ధానికి స‌రిగ్గా ఏడాది కాలం గ‌డిచింది. స‌రిగ్గా అక్టోబ‌రు 22న రాజధాని నగరానికి అమరావతిగా పేరు పెట్టి... ఆ రోజే నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆ రోజు మోదీ... మీకోసం ఏం తెచ్చానో తెలుసా... అంటూ, గంగా జలం... మ‌ట్టి అందించారు. ఇప్ప‌టికీ అమ‌రావ‌తిలో ప్ర‌గ‌తి అదే స్థితిలో ఉంది.
 
ఆంధ్రపదేశ్ కొత్త రాజధాని కోసం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలు లోని 29 గ్రామాల్లోని 22,189 మంది రైతుల నుంచి 34,470 ఎకరాలను భూమిని ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు ఆహ్వానంతో వేలాదిమంది ప్రజలు శంకుస్థాపనకు వచ్చి ఇటుకలను దానం చేశారు. ఈ విశేషమైన నిర్మాణానికి శనివారంతో సంవత్సరం ముగిసింది. కానీ, ఇంత‌వ‌ర‌కు ఏం మిగిలింది... అని చూస్తే, ఆశ‌నిపాత‌మే క‌నిపిస్తోంది.
 
కొత్త రాజ‌ధాని నిర్మాణానికి ఇంత‌వ‌ర‌కు ఒక్క ఇటిక కూడా పేర్చ‌లేదు. దీనితో క‌నీసం తాత్కాలిక స‌చివాల‌యం అయినా నిర్మించుకుని పాల‌న ఇక్క‌డి నుంచే సాగించాల‌ని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు సంక‌ల్పించారు. ప్రస్తుతానికి వెలగపూడిలో 45 ఎకరాల భూమిలో సచివాలయం నిర్మాణం త‌ల‌పెట్టారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17న శంకుస్థాపన చేశారు. రూ.201 కోట్లతో నియమించిన ఈ భవనాల నిర్మాణాన్ని తక్కువ సమయం 8 నెలల్లోనే ముగించారు. ఈ మధ్యనే ఈ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పుడు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఇక్కడి నుంచే సాగిస్తున్నారు. ఈ నెల 28న అమరావతిలోని ఆర్థిక, పరిపాలన భవనాలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని ఆహ్వానిస్తున్నారు. డిసెంబరు 2018 సంవత్సరానికి అమరావతి నిర్మాణం మొత్తం పూర్తి చేయాల‌ని చంద్ర‌బాబు ఆశ‌యం. దానికోసం కేంద్రాన్ని నిధులు కోరుతున్నారు. 
 
ఇంకోప‌క్క రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం చెప్పిన విధంగా ప్లాట్లను పంచడం ప్రారంభించింది. ఇప్పటికే పది గ్రామాల రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు ఇచ్చారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ రాజధాని నిర్మాణం కారణంగా వృత్తి కోల్పోయిన భూమి లేని నిరుపేదలకు, ఉద్యోగం లేని వారికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.2,500 భరణం ఇవ్వాల్సి వ‌స్తోంది. అస‌లు రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఎపుడు ప్రారంభం అవుతుంద‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. 
 
ప్ర‌భుత్వం స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో సింగ‌పూర్ కంపెనీల‌తో రాజ‌ధాని నిర్మాణం ప్రారంభించాల‌ని సంక‌ల్పించారు. కానీ, దానికి న్యాయ‌స్థానం అభ్యంత‌రం చెప్పింది. స్విస్ ఛాలెంజ్ పార‌ద‌ర్శ‌కంగా లేద‌ని, అందులోని నిబంధ‌న‌లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయ‌ని పేర్కింది. దీనితో సింగ‌పూర్ కంపెనీలు కొంచెం నెమ్మ‌దించాయి. రాజ‌ధాని కాంట్రాక్టుల‌పై ఆస‌క్తిని త‌గ్గించాయి. దీనితో ఇపుడు ఏ మూల నుంచి అమ‌రావ‌తి నిర్మాణం ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల్లో ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments