Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్నీరు - పళనిస్వామి వర్గాల మధ్య ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..!

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. పన్నీరు సెల్వం వేరుగా, శశికళ వేరుగా అయిపోయారు. అయితే శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత పళనిస్వామిదే పెత్తనమైంది.

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:22 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. పన్నీరు సెల్వం వేరుగా, శశికళ వేరుగా అయిపోయారు. అయితే శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత పళనిస్వామిదే పెత్తనమైంది. తన అక్క కుమారుడు దినకరన్‌కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించి మరీ వెళ్ళింది శశికళ. తాను లేకున్నా తన కుటుంబంలోని వారే పార్టీ నడిపించాలన్నదే ఆమె ఆలోచన. అయితే దినకరన్ కాస్త ఢిల్లీ ఉచ్చులో చిక్కుకున్నారు. 
 
రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో దొరికిపోయారు. ఇక ఆయన్ను అరెస్టు చేయడమే తర్వాత. ఇలాంటి పరిస్థితుల్లో పళని, పన్నీరు సెల్వంలు ఇద్దరూ ఒక్కటవ్వడానికి సిద్ధమయ్యారు. వీరు కలవడానికి ఒక వ్యక్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయనే ఆర్థికమంత్రి జయకుమార్. 
 
జయకుమార్.. పార్టీలో సీనియర్ నేత. అటు జయలలితకు ఇటు శశికళకు ఇద్దరికి ఈయనంటే ఇష్టం. అందుకే ఆర్థికమంత్రి ఇచ్చారు. జయకుమార్‌కు పన్నీరుసెల్వం అంటే ఇష్టం. అందుకే శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో అందరి కలిసి ఉండాలి. అధికారాన్ని పోగొట్టుకోకూడదు. పార్టీ పరువు బజారుకీడ్చకూడదన్నదే జయకుమార్ భావన. అందుకే పళణిస్వామిని ఒప్పించి మరీ జయకుమార్ ప్రస్తుతం పన్నీరు సెల్వంను తమ వర్గంలో కలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 
 
మంగళవారం రాత్రే జయకుమార్ స్వయంగా ప్రకటన చేశారు. శశికళ, జయకుమార్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు. చక్రం మొత్తం తిప్పేది ఈయనే. ప్రస్తుతం ఈయన చేతిల్లో ఉంది పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గీయులు కలవడం. అయితే దినకరన్ మాత్రం జయకుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పార్టీ నుంచి పంపించడానికి వీళ్ళెవరంటూ ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న విషయం మొత్తాన్ని చూస్తూ పళనిస్వామి మాత్రం మిన్నకుండి పోయారు. 
 
కారణం ఆయన ముఖ్యమంత్రికి పదవి ఉంది కాబట్టి. అదే ఉప ఎన్నికలు జరిగి దినకరన్ గెలిచి ఉంటే పళనిస్వామి పదవి కాస్త ఊడిపోయేది. దినకరన్ సీఎం అయ్యేవారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే తనకు వచ్చిన అవకాశాన్ని పళనిస్వామి ఉపయోగించుకుంటున్నారు. పన్నీరును కలుపుకుంటే తన కుర్చీకి ఢోకా లేదు. పార్టీలో కుమ్ములాటలు ఉండవన్నదే ఆయన భావన. మొత్తం మీద తమిళ రాజకీయాలు ప్రస్తుతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments