Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఏసీబీ నమోదు చేసిన కేసు సరైనదేనా?

Webdunia
ఆదివారం, 14 జూన్ 2015 (10:25 IST)
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన సెక్షన్లు సరైనవేనా? అనే అంశంపై న్యాయ నిపుణులు, రాజకీయ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. సాధారణంగా ప్రజా ప్రతినిధిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయవచ్చా? ఒకవేళ చేస్తే సదరు సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసు చెల్లుబాటవుతుందా? అన్న సందేహాలు అటు న్యాయవర్గాల్లోనే కాక ఇటు రాజకీయ వర్గాలూ వ్యక్తం చేస్తున్నాయి. 
 
సాధారణంగా అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసులు పబ్లిక్ సర్వెంట్లకు మాత్రమే వర్తిస్తాయి. అయితే రేవంత్ రెడ్డి పబ్లిక్ సర్వెంట్ కాదు, అంతేకాక ప్రభుత్వంలో పదవి ఉన్న నేతా కాదు. మరి పబ్లిక్ సర్వెంట్ కాని రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు చెల్లుబాటు అవుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 
 
ప్రజా ప్రతినిధులు కూడా పబ్లిక్ సర్వెంట్లేనన్న సుప్రీంకోర్టు తీర్పులను అస్త్రంగా చేసుకున్న ఏసీబీ, ఆయనపై అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రజా ప్రతినిధిగా రేవంత్ రెడ్డిని పబ్లిక్ సర్వెంట్ కిందే పరిగణించినా, అధికార దుర్వినియోగం అన్న పదం ఈ కేసులో వినపడదు. ఎందుకంటే, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడిన దాఖలా లేదు. 
 
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటు కోసం డబ్బిచ్చినా, తీసుకున్నా ఐపీసీ సెక్షన్ 171బి, 171ఈ కింద కేసు నమోదు చేయాలి. ఈ తరహా కేసుల్లో నిందితులకు స్టేషన్ బెయిలే లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి అనుమతితో ఓటుకు నోటు ఇవ్వజూపిన వ్యక్తిపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(1) కింద కేసు నమోదు చేయాలి. దీనిని ఎన్నికల పిటిషన్‌గా హైకోర్టులోనే దాఖలు చేయాల్సి ఉంది. 
 
ఈ తరహా కేసులో అరెస్టుల మాట ఉండదు. కేవలం అనర్హతకు సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో పోలీసుల పాత్ర ఏమాత్రం ఉండదు. అయితే రేవంత్ కేసులో ఈ రెండు సెక్షన్లను ఏసీబీ అధికారులు విస్మరించారు. రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలన్న వ్యూహాత్మక నిర్ణయంతోనే సదరు సెక్షన్లను పక్కనబెట్టిన ఏసీబీ అధికారులు, ఆయనపై అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనను ఇరికించాలన్న కక్షతో ఈ పని చేసినట్టు తెలుస్తోంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments