Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిక్సా...? బిగ్ లోటస్సా...? 'BRICS'కి పాక్ మిత్రులు... మోదీ సక్సెస్ అవుతారా...?

రేపటి నుంచి బ్రిక్స్ సమాశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం జరుగబోయే బ్రిక్స్ సమావేశాలు భారతదేశంతోపాటు రష్యా, చైనా, పాకిస్తాన్ దేశాలకు ఎంత

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (21:49 IST)
రేపటి నుంచి బ్రిక్స్ సమాశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం జరుగబోయే బ్రిక్స్ సమావేశాలు భారతదేశంతోపాటు రష్యా, చైనా, పాకిస్తాన్ దేశాలకు ఎంతో కీలకం కానున్నాయి. ప్రపంచంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను చర్చల ద్వారా పరిష్కరించుకునే సావకాశాలను వెతకాల్సి ఉంది. మరోవైపు భారతదేశంలో ఉరీ ఉగ్రవాద దాడులు, తాజాగా శ్రీనగర్ లో మరోసారి సైనికులపై ఉగ్రదాడుల వ్యవహారం అంతా బ్రిక్స్ సదస్సులో చర్చకు రానున్నాయి.
 
ఇదిలావుంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశంతో రష్యా, చైనా దేశాలు అంటకాగడం ఆందోళన రేకెత్తించే విషయం. ముఖ్యంగా పాకిస్తాన్ దేశంతో రష్యా ఉమ్మడి సైనిక విన్యాసాలపై భారతదేశం ఇప్పటికే తన అసహనాన్ని తెలిపింది. ఇంకోవైపు భారతదేశం నియంత్రణ రేఖపై పూర్తిస్థాయి కంచె ఏర్పాటు చేసి పాకిస్తాన్ దేశంతో అన్ని సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నా దాని గురించి పల్లెత్తు మాట అనడంలేదు. 
 
దీనితో భారతదేశానికి రష్యా, చైనాలతో కాస్తంత దూరం ఏర్పడిందనే వాదనలు వినబడుతున్నాయి. ఐతే అవన్నీ అవాస్తవమనీ, ప్రపంచ దేశాలన్నిటితోనూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలన్నదే భారతదేశం లక్ష్యమని ఇప్పటికే విదేశాంగ మంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రేపటి నుంచి గోవాలో జరుగనున్న బ్రిక్స్ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సమావేశాల్లో రష్యాతో భారతదేశం 7 కీలక ఒప్పందాలను కుదుర్చుకోనుందని తెలుస్తోంది.
 
ఇదిలావుంటే బ్రిక్స్ లోగోపై ఆప్, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోవా ప్రాముఖ్యతను తెలిపే విధంగా లోగోను రూపొందించాల్సిందనీ, అలాంటిది భాజపా గుర్తు కమలం పోలికలో బ్రిక్స్ లోగోను రూపొందించడాన్ని విమర్శించారు.

వెబ్ దునియా తెలుగు వార్తలు, మరిన్ని విశేషాలు పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments