50% ప్రత్యేక హోదా కావాలంటున్నారు... మీరేమో అది చెల్లని రూ.1000 నోటంటున్నారు... కాస్త చూస్కుంటే మంచిదేమో...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే పవన్ కళ్యాణ్ డిమాండును కేంద్ర మంత్రి సుజనా చౌదరి మెత్తగా కొట్టిపారేశారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా ఇంకా ప్రత్యేక హో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే పవన్ కళ్యాణ్ డిమాండును కేంద్ర మంత్రి సుజనా చౌదరి మెత్తగా కొట్టిపారేశారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా ఇంకా ప్రత్యేక హోదా అని మాట్లాడటం అర్థం లేని ప్రశ్న అనీ, అది ఒక చెల్లని రూ.500, రూ.1000 నోట్ల వంటివంటూ వ్యాఖ్యానించారు. ఇక ప్రత్యేక హోదా అనే దాని గురించి మాట్లాడకపోవడమే మంచిదని పేర్కొన్నారు.
దీనిపై వెబ్ దునియా తెలుగు పోల్ నిర్వహించింది. ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రత్యేక హోదాపై అభిప్రాయాన్ని కోరగా 50.4% మంది జనసేన ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటాన్ని సమర్థిస్తున్నారు. అవసరం లేదని 44 శాతం అంటుండగా ఏమీ చెప్పలేని సందిగ్దంలో మరో 5.4 శాతం మంది తేలారు. ఐతే మెజారిటీ ప్రజలు ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెపుతున్నట్లు అర్థమవుతుంది.
దీన్నిబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండా కావడం ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది. మరి ప్రత్యేక హోదా చెల్లని నోటు లాంటిదని చెపుతున్న తెదేపా నాయకులు తమ వరస మార్చుకుంటారో లేదంటే తాము చెప్పిన మాటలతో ప్రజలు ఒప్పిస్తారో చూడాల్సి ఉంది. ఐతే ప్రత్యేక హోదా సెంటిమెంట్ కొనసాగితే మటుకు జనసేన ప్రభంజనం ఏపీలో ఊపుతుందనడంలో సందేహం కూడా పడనక్కర్లేదు. చూద్దాం... ఏం జరుగుతుందో...?