Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఐదుగురు అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు 'అయ్య' ఆఖరి కోర్కె తీర్చుదామంటున్నారా...?

తమిళనాడు రాజకీయాలు చాలా చాలా సెంటిమెంటుతో కూడుకుని ఉంటాయి. ఇది ఎన్నోమార్లు రుజువైంది. ఇటీవలే మాజీముఖ్యమంత్రి జయలలిత ఆమె సీఎంగా ఉండగానే కన్నుమూశారు. గతంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయారు. ఇక

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (15:44 IST)
తమిళనాడు రాజకీయాలు చాలా చాలా సెంటిమెంటుతో కూడుకుని ఉంటాయి. ఇది ఎన్నోమార్లు రుజువైంది. ఇటీవలే మాజీముఖ్యమంత్రి జయలలిత ఆమె సీఎంగా ఉండగానే కన్నుమూశారు. గతంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయారు. ఇక అమ్మ మరణం తర్వాత కొత్తగా పన్నీర్ సెల్వం గద్దెనెక్కారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ పదవిని చిన్నమ్మ శశికళకు ఇచ్చేద్దామని అంతా మద్దతు పలుకుతున్నారు. కానీ అన్నాడీఎంకెకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఏమీ మాట్లాడటం లేదంట. 
 
దీనితో ఆ ఐదుగురు ఏం చేయబోతున్నారనే చర్చ ఊపందుకుంది. అసలు తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలను చూస్తే అసెంబ్లీ స్థానాలు మొత్తం 235. జయలలిత మరణంతో 234 మందికి చేరింది. ఈ సంఖ్యలో అన్నాడీఎంకే పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు కాగా డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ పార్టీకి 8 మంది, ఐయూఎంఎల్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉండగా విపక్ష బలం 98. మ్యాజిక్ ఫిగర్ 118. అంటే డీఎంకేకు మరో 20 మంది సభ్యుల బలం ఉంటే కుర్చీ వారిదే. 
 
ఈ లెక్కలు ఇలావుంటే శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు 130 మంది మద్దతు తెలుపుతున్నా ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం మాట్లాడటం లేదట. ఆ ఐదుగురు డీఎంకెతో చేతులు కలుపుతారేమోననే చర్చ నడుస్తోంది. ఎలాగూ అయ్య(కరుణానిధి) ఆఖరి దశలో ఉన్నారు కనుక ఆయనకు సీఎం పీఠాన్ని కట్టబెట్టి ఆయన కోర్కె తీర్చాలని ఈ ఐదుగురూ అనుకుంటున్నారేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే తమిళనాట మరో పెను రాజకీయ ప్రకంపనలు ఖాయం.

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments