Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో అగ్నిపర్వతం బద్దలౌతుందా...!

Webdunia
ఇండోనేషియాలోని పశ్చిమతీర ప్రాంతంలో ఉన్న హిందూ మహాసముద్రంలో కొందరు శాస్త్రజ్ఞులు భారీ అగ్ని పర్వతాన్ని కనుగొన్నారు. సునామీలు వాటి తీరు తెన్నుల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ అగ్నిపర్వతం కనపడింది.

దాదాపు 15 వేల అడుగుల ఎత్తున్న ఈ భారీ అగ్నిపర్వతం 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, సముద్ర భూగర్భ శాస్త్రవేత్త యూసుఫ్‌ సూరజ్‌మన్‌ డిజాజా దిహర్జా వెల్లడించారు.

దీనిని కనుగొనడం పూర్తిగా ఊహించని పరిణామని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాని వలన మానవాళకి పెద్దగా ప్రమాదం ఏమీ లేదన్నారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొన్న ఈ అగ్ని పర్వతం సుమత్రా దీవులకు పశ్చిమంగా 330 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన తెలిపారు.

ఈ అగ్నిపర్వతం పై అంచులు సముద్ర మట్టానికి 1,380 మీటర్ల లోతులో ఉందన్నారు. సునామీల వల్ల ప్రపంచానికి ఉన్న ముప్పు గురించి తెలుసుకునేందుకు ఈ శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తోంది.

ఇదివరకు 2004లో ఆసియా ప్రాంతంలో సంభవించిన సునామీ కారణంగా దాదాపు 2,30,000 మంది మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో సగం మంది భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్నవారేనని ఆ శాస్త్రజ్ఞులు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments