Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడులు యథాతథం: ఆగని అతివల ఆర్తనాదాలు

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2009 (13:44 IST)
File
FILE
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల ఆదేశాలు జారీ చేస్తున్నా ఉన్మాదులు మాత్రం వాటిని బేఖాతర్ చేస్తున్నారు. ఫలితంగా.. నారీలోకం ప్రాణభయంతో వణికి పోతోంది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో యాసిడ్ దాడులు, ప్రేమోన్మాదులు హూంకరింపులు, ఈవ్ టీజింగ్ వేధింపులు, హత్యలు, హత్యాచారాలు, ఖాకీల అఘాయిత్యాలు, భార్యలపై భర్తల దాడులు.. ఇలా ఒకటేంటి కొత్తకొత్త తరహాలో ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి.

వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం పక్కా ఆదేశాలు జారీ చేస్తోంది. దాడులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని సాక్షాత్ దేశంలోనే తొలి మహిళా హోం మంత్రే స్వయంగా ప్రకటించారు. ఇవేమీ ఉన్మాదుల్లో భయం కలిగించలేదు. ఫలితంగా దాడులు యధావిధిగా జరుగుతున్నాయి. ఆగస్టు 3వ తేదీ (సోమవారం) కూడా ఒక మహిళపై యాసిడ్ దాడి జరుగగా, మరో మహిళను కట్టుకున్న భర్తే గొంతుకోసి పరారయ్యాడు. ఈ రెండు సంఘటనలు వరంగల్‌ జిల్లాల జరిగాయి. దీంతో నారీలోకం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

వరంగల్‌‌లో బీటెక్ యువతులపై జరిగిన యాసిడ్‌ దాడుల పరంపర అలానే కొనసాగుతూ ఉంది. నేరం రూపం మారిన, నేరస్తుడు ఆయుధం ఏదైనా కారణం మాత్రం ప్రేమోన్మాదం లేదా కామోన్మాదమే. మహిళలపై జరుగుతున్న దాడుల్లో మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని ప్రభుత్వ గణాంకాలు చెపుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర శాసన సభలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ హామీ ఇచ్చి 24 గంటలు కాకముందే కర్నూల్‌ జిల్లా ఆళ్ళగడ్డలో ఒక ప్రేమోన్మాది బీటక్ విద్యార్థిని గొంతుకోసిన ఉదంతం
File
FILE
పట్టపగలే జరిగింది. మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఎక్కువగా నష్టపోతున్నది విద్యార్థినులే. ఆయేషా మీరా హత్య కేసు నుంచి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ కేసు వరకు.. బాధితులందరూ విద్యార్థినిలే.

వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడిపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం స్పందించిన తీరు అమోఘం. పోలీసుల తీరును రాష్ట్ర ప్రజలు హర్షించారు. కోర్టులు, చట్టాలకు అందని తీర్పుగా మహిళా లోకం కొనియాడింది. ఇలాంటి తీర్పు నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందన్న ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఇలాంటి సాహసం చేసిన అధికారిని ప్రభుత్వం ఏడాది తిరగకుండానే బదిలీ చేసింది.

ఆ తర్వాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పలరకాల అఘాయిత్యాలు, దాడులు జరిగాయి. ఏ ఒక్క పోలీసు దుండగులపై కఠిన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫలితంగా దండుగులు మరింత రెచ్చిపోతున్నారన్నది జగమెరిగిన సత్యం. దాడి జరిగిన తర్వాత పోలీసుల దర్యాప్తు ఎలా ఉన్నా, ముందస్తు భయం కూడా చాలా వరకూ దాడులు జరగకుండా కాపాడుతుందని మహిళా సంఘాల నాయకులు అంటున్నారు. అయితే, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగా కేసును ఏదో రకంగా నీరుగార్చేందుకు పోలీసులే నడుం బిగిస్తున్నారు.

ఛార్మినార్‌ సాక్షిగా ప్రేమోత్పాతం ఓ యువతిని కాటేసినా మన పోలీసు యంత్రాగం మాత్రం బూజుపట్టిన చట్టాల పరిధిలోనే నడుచుకుంటోంది. దీంతో యాసిడ్‌ దాడులు, ప్రేమోన్మాదుల హూంకరింపులు, ఈవ్‌ టీజింగ్‌‌లు, హత్యలు. అత్యాచారాలు. ఏరోజుకారోజు పెరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థ పనితీరును ప్రశ్నిస్తున్నాయి. మహిళా హోంమంత్రికి సవాల్‌ విసురుతున్నాయి. రాష్ట్ర నారీలోకం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments