హైదరాబాదులో తెలుగు బ్లాగర్ల సమావేశం
అంతర్జాలం(ఇంటర్నెట్)లో సాధారణంగా అందరూ ఇంగ్లీషు ఉపయోగిస్తుంటారు. ఉత్తరాలకైనా, వెబ్‌సైట్లకైనా ఇంగ్లీషు తప్పనిసరి. కాని గత రెండేళ్లుగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఎందరో తెలుగు భాషాభినుల కృషిఫలితంగా కలం పట్టి కాగితంపై రాసినంత తేలిగ్గా ఇంటర్నెట్‌లో కూడా ఎటువంటి సాఫ్ట్‌వేర్ లేకుండా తెలుగు రాసే వివిధ ఉపకరణాలు తయారుచేయబడ్డాయి.