Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడిపై కత్తిపీటతో దాడి..

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (13:20 IST)
ప్రియుడు తనను ప్రేమించి, మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువతి.. తన ప్రియుడిపై కత్తిపీటతో దాడిచేసింది. మరొకరి సాయంతో అర్థరాత్రి వేళ మోసం చేసిన ప్రియుడి ఇంటికి వెళ్లిన ప్రియురాలు.. కత్తిపీటతో దాడి చేసి హత్య చేసింది. ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, తిరుమలాయ పాలెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తిరుమలాయపాలేనికి చెందిన ఒమ్మి నాగశేషు అలియాస్ నాగు (25) అనే వ్యక్తి తాపీ పని చేస్తుంటాడు. ఈయనకు రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్లు డిబేరాతో 2017లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో డిబేరా సుమారు రూ.2 లక్షల నగదు, బంగారపు గొలుసు నాగుకు ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
అయితే ఇటీవలే నాగు వేరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్నడి బేరా.. కరణం శివన్నారాయణ అనే వ్యక్తితో కలిసి గురువారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో తిరుమలాయ పాలెంలోని నాగు ఇంటికి వెళ్లి అతడితో ఘర్షణకు దిగింది. 
 
ఆ సమయంలో వారి వెంట తెచుకున్న కత్తిపీట, కర్రతో నాగుపై దాడి చేయడంతోపాటు, అడ్డువచ్చిన నాగు తల్లి గంగను కూడా గాయపర్చి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన నాగును బంధువులు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కోరుకొండ పోలీసులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments