ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కుమార్తెను చంపిన మహిళ

ఐవీఆర్
బుధవారం, 3 సెప్టెంబరు 2025 (11:00 IST)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో దారుణ సంఘటనలు వెలుగుచూసాయి. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ ముందుగా తన భర్తను, ఆ తర్వాత 22 ఏళ్ల కుమార్తెను అత్యంత దారుణంగా హతమార్చింది. కూతురిని హత్య చేసి సమీపంలోని అడవిలోకి తీసుకుని వెళ్లి ఆమె మృతదేహం చుట్టూ క్షుద్రపూజలు జరిగినట్లు సీన్ క్రియేట్ చేసింది ఆ కసాయి తల్లి.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. వడితల గ్రామంలో కవిత అనే మహిళ అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ప్రియుడితో తరచూ గడిపేందుకు పక్షవాతానికి గురై మంచంలో పడిన భర్త అడ్డుగా వున్నాడని గత జూన్ నెలలో అతడిని చంపేసింది. ఆ తర్వాత వ్యాధి ముదిరి అతడు చనిపోయాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు జరిపించింది.
 
ఇక ఆ తర్వాత కుమార్తె తల్లి ప్రవర్తనపై పలుమార్లు నిలదీయడంతో ఇక తన వ్యవహారాన్ని బట్టబయలు చేస్తుందని దారుణానికి ఒడిగట్టింది. ఆమెను చంపేసి సమీపంలోని కాటారం జాతీయ రహదారి పక్కన పడేసి ఆమె మృతదేహం చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి అక్కడే ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించే యత్నం చేసింది. ఐతే ఈ హత్య విషయంలో కవిత ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. దాంతో నిజాన్ని అంగీకరించింది నిందితురాలు. భర్త, కుమార్తెను హత్య చేసిన కవితతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments