Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ.. బైకుపై దింపుతామని నమ్మించి....

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (12:18 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యాచారానికిగురైంది. తార్నాక బస్టాపులో అర్థరాత్రిపూట బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను కొందరు కామాంధులు మాటలు కలిపి.. బైకుపై దింపుతామని నమ్మించారు. ఆ తర్వాత తమ బైకుపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన ఈ నల 7వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 7వ తేదీన తార్నాకలోని ఓ మహిళ బస్టాప్‌లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా, ఆ సమయంలో బైకుపై అటుగా వెళుతున్న బర్న యేసు (32) అనే వ్యక్తి ఆమెను గమనించాడు. ఆ తర్వాత ఆమె వద్దకు వెళ్లి మాటలు కలిపి, తాను బైకుపై తీసుకెళ్లి దింపుతానని నమ్మించాడు. యేసు మాటలు నమ్మిన ఆ మహిళ అతనితో బైకుపై వెళ్లగా, ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం. ఆ తర్వాత తన స్నేహితులకు కూడా సమాచారం చేరవేయడంతో వారు కూడా అక్కడకు వచ్చి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. పిమ్మట బాధితురాలిని తీసుకొచ్చి మళ్లీ తార్నాక బస్టాండులోనే వదిలిపెట్టారు. ఎనిమిదో తేదీ నుంచి మౌనంగా ఉంటూ వచ్చిన ఆ మహిళ... చివరకు లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తార్నాక బస్టాప్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందిడైన బర్న యేసుతో పాటు మధుయాదవ్ (31), ప్రశాంత్ (20), తరుణ్ (20), రోహిత్ (19)లను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments