Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐఎం - కోల్‌కతా మెన్స్ హాస్టల్‌లో బాలికపై అత్యాచారం..

ఠాగూర్
శనివారం, 12 జులై 2025 (15:21 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినినులపై వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఆర్జీకర్ వైద్య కాలేజీ, కోల్‌కతాలో న్యాయ కాలేజీలో విద్యార్థినిలపై జరిగిన అత్యాచార ఘటనలు మరిచిపోకముందే తాజాగా ఐఐఎం కోల్‌కతాతో చదువుతున్న ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ విద్యా ప్రాంగణంలోని మెన్స్ హాస్టల్‌లో ఈ దారుణం జరిగింది. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తాను మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి తనకు కౌన్సెలింగ్‌ చేస్తానని చెప్పి శుక్రవారం బాయ్స్‌ హాస్టల్‌కు పిలిపించుకున్నాడని తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత అతడు ఇచ్చిన కూల్‌డ్రింక్‌ తాగడంతో తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని ఏం జరిగిందో తెలియలేదని వాపోయింది. 
 
స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్లు గ్రహించానని తెలిపింది. ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా.. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ విద్యార్థి తనను బెదిరించినట్లు ఆమె వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments