Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు ఆస్తినంతా అప్పగిస్తే ఆ పని చేసింది

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (19:04 IST)
భార్యను ఎంతగానో నమ్మాడు. ఆమే సర్వస్వం అనుకున్నాడు. తన పేర మీద ఉన్న ఆస్తులన్నింటినీ ఆమె పేరు మీదకు మార్చాడు. ఆమె చెప్పిందే వినేవాడు. కానీ ఆమె మాత్రం తన భర్తను మోసం చేసింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన భార్య వేరొకరితో కలిసి ఉంటోందని భావించిన భర్త అనుమానపడ్డాడు. లోలోపల మథనపడిపోయాడు. చివరకు..

 
యుపీలోని గోండాలో ప్రవీణ్ కుమార్ నివాసముంటున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ కుమార్ బాగా ఆస్తిపరుడు. కానీ పిల్లలు లేరు. తన భార్య బాగా చదువుకుంది. కానీ ఇంటి దగ్గరే ఉండేది. భార్య అంటే ప్రవీణ్ కుమార్‌కు ఎంతో ఇష్టం. అందుకే తన పేర మీద ఉన్న ఆస్తులు మొత్తాన్ని ఆమె పేరు మీదకు మార్చాడు. తాను నిర్వహిస్తోన్న కంపెనీలోను భార్యను భాగస్వామ్యురాలిగా చేశాడు. అదే అతను చేసిన తప్పని ఆ తరువాత తెలుసుకున్నాడు.

 
భార్యను స్వేచ్ఛగా వదిలేయడం.. ఆస్తి మొత్తం ఆమె చేతిలోనే ఉండిపోవడంతో ఆమె పాత బాయ్‌ఫ్రెండ్ లైన్లోకి వచ్చేసాడు. అతనికి కావాల్సినంత డబ్బులు అప్పుడప్పుడు ఇస్తూ ఉండేది. భర్తకు అనుమానం వచ్చింది. భార్యను ప్రశ్నిస్తే ఏమనుకుంటుదేమో అనుకున్నాడు. లోలోపల బాగా మథనపడిపోయాడు. తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. విషయాన్ని డైరెక్టుగా భార్యనే అడిగేశాడు. అంతే... ఇక తనను భర్త విడిచిపెట్టడని అనుమానపడిన భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోస్టుమార్టంలో బయటపడి కటాకటాల పాలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments