Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ టు విజయవాడ: వాషింగ్ మెషీన్‌లో కోటీ 30 లక్షలు కుక్కి తరలిస్తూ దొరికిపోయారు

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (16:37 IST)
నల్ల డబ్బు. ప్రజల వద్ద దోచుకున్న నల్ల డబ్బును ఎలా దారి మళ్లించాలో దొంగ వ్యాపారులకు బాగా తెలుసు. పోలీసుల కళ్లుగప్పి ఎలాగో ఆ డబ్బును తరలించేస్తుంటారు. తాజాగా విశాఖపట్టణం నుంచి విజయవాడకు ఓ వాషింగ్ మెషిన్లో రూ. 1.30 కోట్లను తరలిస్తూ పట్టుబడ్డారు.
 
పూర్తి వివరాలను చూస్తే... విశాఖకు చెందిన ఓ బడా ఎలక్ట్రానిక్ దుకాణం నుంచి ఓ ఆటో బయలుదేరింది. ఆ ఆటోలో వాషింగ్ మెషీన్ వేసుకుని వెళ్తున్నారు. చూసినవారికి ఏదో వాషింగ్ మెషీన్ కొనుక్కుని వెళ్తున్నారులే అనిపిస్తుంది. కానీ నిజం అది కాదు. అందులో కాసుల కట్టలు పేర్చి పెట్టి వున్నాయి.
 
ఓ రహస్య వ్యక్తి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. విశాఖ ఎయిర్ పోర్ట్ పరిసరాల నుంచి వెళుతున్న ఆటోను అడ్డుకుని అందులో వున్న వాషింగ్ మెషీన్ తెరిచి చూసి షాక్ తిన్నారు. మెషీన్ నిండుగా రూ. 500 నోట్ల కట్టలు పేర్చి వున్నాయి. ఆ డబ్బుకు లెక్కచెపుతూ సరైన రసీదులు చూపించకపోవడంతో డబ్బును సీజ్ చేసారు. సెక్షన్ 41, 102 కింద పోలీసులు కేసు నమోదు చేసి నగదును స్టేషనుకి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments