వైజాగ్ శ్వేతకు ఆడపడుచు భర్త నుంచి లైంగిక వేధింపులు!!

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (09:57 IST)
ఇటీవల వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో శవమై కనిపించిన ఐదు నెలల గర్భిణి శ్వేత కేసులో సంచలన విషయం ఒకటి వెలుగు చూసింది. ఆడపడుచు భర్త నుంచి ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అదేసమయంలో శ్వేత మృతదేహానికి విశాఖ కేజీహెచ్‌లో ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఈ పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక పోలీసులకు అందజేశారు.
 
ఇటీవల ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమైన కనిపించిన 24 యేళ్ల శ్వేత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేశారు. ముగ్గురు వైద్యుల బృందం దీన్ని పూర్తి చేసి ప్రాథమిక నివేదికను పోలీసులకు అందజేశారు. శ్వేతతి ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ కేసులో మరో విస్తు గొలిపే అంశం ఒకటి వెలుగు చూసింది. ఈ శ్వేత ఆడపడుచు భర్త నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు, దీంతో ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపులు, అత్త, ఆడపడుచుపై వరకట్న వేధింపుల కేసులు పెట్టారు. 
 
ఈ కేసులో దర్యాప్తులోభాగంగా, భర్త, అత్త, మామ, ఆడపడుచును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త తరపు బంధువులందరూ పోలీసుల అదుపులో ఉండటంతో శ్వేత మృతదేహాన్ని తల్లి, ఆమె తరపు బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా గురువారం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

కపుల్స్ సొసైటీ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న కథతో సంతాన ప్రాప్తిరస్తు

Allari Naresh: 12A రైల్వే కాలనీ లో డిఫరెంట్ షేడ్స్ పాత్ర లో అల్లరి నరేష్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం