గృహ హింస ఫిర్యాదుతో కెనడా వెళ్లలేకపోయాడు, అదే ఆమె పాలిట మృత్యువైందా?

ఐవీఆర్
గురువారం, 19 ఫిబ్రవరి 2026 (18:51 IST)
తెలంగాణలోని వనస్థలిపురంలో మూడు నెలల గర్భిణిని ఆమె మాజీభర్త నేరుగా ఆమె ఇంటికే వెళ్లి నరికి చంపాడు. తనతో విడాకులు తీసుకోవడమే కాకుండా తనపై కేసులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహంతో వున్న అతడు ఆమె పునర్వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. 2022లో ఆమెను పెళ్లి చేసుకుని భార్యతో సహా కెనడాలో కొంతకాలం నివసించారు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ నిపుణులే. ఐతే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2024లో విడాకులు తీసుకున్నారు.
 
విడాకులకు ముందు ఈ మహిళ గతంలో నిందితుడిపై గృహ హింస ఫిర్యాదు చేసింది. దాంతో అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసారు. హంతకుడు దేవరకొండ మహేష్ బుధవారం మధ్యాహ్నం సమయంలో గ్రీన్‌సిటీ కాలనీలోని తన మాజీ భార్య సునీత వుంటున్న నాల్గవ అంతస్తు అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డాడు. నేరుగా ఆమె ఉన్న గది లోపలికి వెళ్లి లోపలి నుండి లాక్ చేశాడు.
 
వస్తూనే తన వెంట రెండు కత్తులు, ఒక పెట్రోల్ బాటిల్‌తో కూడిన బ్యాగ్‌ను తీసుకొచ్చాడు. మహేష్ ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కొద్ది నిమిషాల్లోనే సునీతను కత్తులతో దాడి చేశాడు. ఆమె తలతో సహా ఆమె శరీరంలోని వివిధ భాగాలపై విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె తలపై అనేకసార్లు పొడిచాడు. బాధితురాలి ఆర్తనాదాలు విన్న ఇతర కుటుంబ సభ్యులు ఆమె గదికి పరిగెత్తుకుంటూ వచ్చి చూడగా సునీత రక్తపు మడుగులో నేలపై పడి ఉంది. అప్పటికే నిందితుడు వాష్‌రూమ్‌లో తాళం వేసుకుని ఉన్నాడు.
 
సునీతపై దాడి జరిగిన సమయంలో, సునీత అత్తగారు టెర్రస్‌పై బట్టలు ఆరవేసేందుకు వెళ్లింది. ఆమె బావమరిది వేరే గదిలో పని చేస్తున్నారు. సునీత ఇంట్లోనే పని చేస్తోంది. 2025 ప్రారంభంలో ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకుని వనస్థలిపురంలో వుంటోంది. కాగా గత సంవత్సరం, తన తల్లి మరణించిన తర్వాత, మహేష్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఐతే సునీత దాఖలు చేసిన గృహ హింస కేసుకు సంబంధించి అతని పేరు మీద లుక్ అవుట్ సర్క్యూట్ జారీ చేయబడినందున విమానాశ్రయంలో పోలీసులు అతన్ని అడ్డగించారు. అతడి పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు.
 
ఎల్‌ఓసి కారణంగా అతను కెనడాకు తిరిగి వెళ్లలేకపోయాడు. దీనితో మహేష్ తీవ్ర నిరాశ చెందాడు. మరోవైపు సునీత రెండో పెళ్లి చేసుకుని తనపై కక్ష సాధిస్తోందని భావించి ఆమెపై పగ పెంచుకున్నాడు. ప్రతీకారంతో రగిలిపోయిన అతడు బుధవారం నాడు ఆమెను హత్య చేసాడు. అతడు వచ్చినదారినే కెనడా వెళ్లిపోయి వుంటే ఈ దారుణం జరిగి వుండేది కాదేమోనని ఇరుగుపొరుగువారు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments