Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను 15 ముక్కలు చేసి.. ప్రియుడితో కలిసి విహార యాత్ర

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (10:16 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో దారుణం జరిగింది. అక్రమ సంబంధాన్ని మరో పురుషుడు బలయ్యాడు. తన ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య శవాన్ని 15 ముక్కలుచేసింది. ఆ ప్రియుడుతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఈ నెల 4వ తేదీన ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
పోలీసుల కథనం మేరకు... మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ (29), ముస్కాన్ రస్తోగి (27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో ఎక్కువగా సమయం గడపాలన్న ఉద్దేశంతో పెళ్లి తర్వాత కొన్నాళ్లకు ఉద్యోగాన్ని వదిలేశాడు. ఈ నిర్ణయం కుటుంబం గొడవలతో కారణమైంది. దీంతో సౌరభ్ తన భార్యతో కలిసి మీరట్‌లో వేరు కాపురం పెట్టాడు. ఈ క్రమంలో వారికి గత 2019లో కుమార్తె ఆరోపుట్టిన రోజు కావడంతో ఫిబ్రవరి 24వ తేదీన ఇంటికొచ్చాడు. 
 
మరోవైపు, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్త తొలగించుకోవాలని ఎప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న ముస్కాన్.. ప్రియుడు సాహిల్ (25)తో కలిసి భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. పథకంలోభాగంగా ఈ నెల 4 తేదీన భోజనంలో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. 
 
భోజనం చేసిన వెంటనే సౌరభ్ నిద్రలోకి జోరుకోగానే ముస్కాన్ సాహిల్ ఇద్దరూ కలిసి గాఢనిద్రలో ఉన్న సౌరభ్‌ను కత్తితో పొడిచి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని 15 ముక్కలు చేసి వాటిని ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి దానిని తడి సిమెంట్‌తో నింపేశారు. డమ్మును ఇంట్లో ఉంచేసి ముస్కాన్, సాహిల్ ఇద్దరూ కలిసి హిమాచర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనానీకి విహారయాత్రకు వెళ్లారు. 
 
తమతో పాటు సౌరభ్ ఫోనును కూడా తీసుకెళ్లిన నిందితులు ఎప్పటికపుడు ఆయా సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెడుతూ సౌరభ్ బతికో ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సౌరభ్‌ నుంచి స్పందన లేకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిరాతకం వెలుగులో వచ్చింది.
 
నిందితులు ముస్కాన్, సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన దారుణాన్ని వారు అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కాగా, భర్తను హత్య చేసిన తమ కుమార్తెను ఎంతగానో ప్రేమించాడని, అతడిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్‌ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments