Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిని లోబరుచుకునేందుకు హింసించిన మామ, చివరికి...

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (22:58 IST)
కోడలు అంటే కూతురితో సమానం. కొడుకు భార్యను గౌరవంగా చూసుకోవాలి. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన కోడలిని తమ సొంత కుమార్తెలా భావించాలి. కానీ కామంతో కళ్ళుమూసుకుపోయిన మామ ఏకంగా కోడలిపైనే కన్నేశాడు. భార్యను పోగొట్టుని కామంతో కొట్టుకుంటున్న ఆ మామ కోడలిని గదికి రమ్మన్నాడు. భర్తకు చెప్పినా ఉపయోగం లేకపోవడంతో ఆ అభాగ్యురాలు ఆత్మహత్య చేసుకుంది.

 
హర్యానా జిల్లా పల్వాల్ జిల్లాలోని అలీగఢ్ రోడ్డులో నివాసముంటున్నారు రజినీకాంత్ అతడి భార్య. ఆరునెలల క్రితమే వీరికి వివాహం జరిగింది. రజినీకాంత్ తండ్రి మోహన్ భార్య అనారోగ్యంతో రెండేళ్ళ క్రితం చనిపోయింది. ఇంటి పట్టునే ఉంటున్న మోహన్ ఏ పని చేసేవాడు కాదు. 

 
పెళ్ళయిన ఐదు నెలల వరకు మామ ఆప్యాయంగానే చూసుకున్నాడు. కోడలిని అమ్మా అమ్మా అంటూ పిలిచేవాడు. అయితే గత నెల రోజుల నుంచి మోహన్ కోడలిపై కన్నేశాడు. కొడుకు ఆఫీసుకు వెళితే చాలు కోడలిని ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. మామ అలా చేస్తుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ అభాగ్యురాలు. మెల్లగా భర్తకు చెప్పింది. నా తండ్రి మంచి వాడు. అలా చేయడు. నువ్వు పొరపాటు పడి ఉంటావన్నాడు. దీంతో ఆమె కూడా సైలెంట్‌గా ఉండేది.

 
భర్తకు చెప్పినా ఉపయోగం ఉండదని భావించింది. కానీ మామ ప్రవర్తన రోజురోజుకు ఎక్కువ కావడం.. ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉండటంతో మనస్థాపానికి గురైంది. శారీరక సుఖం కోసం మామ చేస్తున్న పనిని భర్తకు ఎలా అర్థమయ్యాలో చెప్పలేక సతమతమవుతూ ఉండేది. అయితే రెండురోజుల క్రితం మోహన్ తన కోడలిని బలవంతం చేయబోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను లేఖలో రాసింది.
 
తాను పడిన ఆవేదన.. భర్తకు చెప్పలేక పడిన బాధ.. మామ హింస మొత్తాన్ని కలగలిపి ఒక లేఖ రాసింది. భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు భర్త. భార్య చెబుతున్నా తను పట్టించుకోలేదంటూ బోరున విలపించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం