ఉలిక్కిపడిన భాగ్యనగరం.. ఒకే రోజు రాత్రి నలుగురి హత్య

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (12:52 IST)
భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే రోజు రాత్రి ఏకంగా నలుగురు హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు హత్యకు గురయ్యారు. 24 గంటల పోలీస్ గస్తీ ఉన్నప్పటికీ ఈ హత్యలు ఎలా జరిగాయన్నది మిస్టరీగా మారిపోయింది. ఈ హత్యల వార్త తెలియగానే భాగ్య నగరి వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఓ ఘటనలో ఇద్దరు హిజారు హత్యకు గురికాగా, మరో ఇద్దరు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారు కావడం గమనార్హం. 
 
నిత్యం రద్దీగా ఉండే రాజేంద్ర నగర్ సర్కిల్ మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో ఈ హత్యలు జరగడం గమనార్హం. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ హత్యలు జరిగాయి. దుప్పట్లు అమ్ముకునే చిరు వ్యాపారి ఒకరు, రోడ్డు పక్కన నిద్రించే మరో వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. వీరిద్దరిని గ్రానైట్ రాళ్లతో కొట్టిన దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. 
 
మరోవైపు, టప్పాచబుత్రలో సైతం మంగళవారం రాత్రి ఘోరం జరిగింది. దైబాగ్ ప్రాంతంలో ఇద్దరు హిజ్రాలు హత్యకు గురయ్యారు. మృతులను యూసుఫ్ అలియాస్ డాలి, రియాజ్  అలియాస్ సోఫియాగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇద్దరిని కత్తితో పొడిచి, బండరాళ్ళతో కొట్టి దారుణంగా చంపేశారు. ఇలా ఒకే రోజు రాత్రి ఏకంగా నలుగురు హత్యకు గురికావడంతో భాగ్యనగరిలో కలకలంరేపింది. ఈ హత్యలకు పాల్పడింది ఎవరన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments