అన్నా వదినా అంటూ నా ప్రియుడితో సరసాలా? ముక్కోణపు ప్రేమలో యువతి మృతి

ఠాగూర్
మంగళవారం, 26 ఆగస్టు 2025 (10:40 IST)
ఓ వ్యక్తి ఇద్దరు ఒకేసారి ఇద్దరు యువతులను ప్రేమించాడు. ఈ ముక్కోణపు ప్రేమ వ్యవహారంలో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుత్తి ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్, పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన స్వాతి (22), మరో యువతి ప్రతిభా భారతి అనంతపురం సాయినగర్ మూడో క్రాస్‌లో ఉన్న దీపు బ్లడ్ బ్యాంకులో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. అరుణ్ కుమార్, ప్రతిభా భారతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారితో స్వాతి సన్నిహితంగా ఉండేది. అరుణ్ మొదటి ప్రియురాలికి తెలియకుండా రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ విషయం ప్రతిభా భారతికి తెలిసింది. 
 
దీన్ని జీర్ణించుకోలేని ప్రతిభా భారతి.. మీ అంతు తేలుస్తానంటూ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రతిభా భారతి సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో స్వాతికి ఫోన్ చేసి పరుష పదజాలంతో దూషించింది. 'అన్నా వదినా అంటూ' నా ప్రియుడితోనే ప్రేమ వ్యవహారం నడుపుతావా? మీ ఇద్దరి విషయం నాకు తెలిసింది. ఈ రోజు ల్యాబ్ దగ్గరకు రండి. మీ కథ తేలుస్తా అని బెదిరించింది. ఈ విషయంలో స్వాతి భయపడిపోయింది. 
 
తాను ఉంటున్న ప్రైవేటు వసతిగృహంలో ఎవరూలేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు చున్నీ బిగించుకుని బలవన్మరణానికి పాల్పడింది. అక్కడి సిబ్బంది వెంటనే ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments