భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (12:12 IST)
బంధువుల ఇంటికి వెళ్లి వద్దామని నమ్మించి భార్యాపిల్లలిద్దరిని బైకుపై ఎక్కించుకుని ఓ బావి వద్దకు తీసుకెళ్లిన ఓ వ్యక్తి.. ఆ ముగ్గురుని బావిలో తోసేశాడు. ఆ తర్వాత గొంతుకోసుకుని తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లా పాకాల మండలంలో గురువారం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మద్దినాయనిపల్లె పంచాయతీ పెద్దూరు హరిజన వాడకు చెందిన టి.గిరి (37), హేమంత కుమారి (35) భార్యాభర్తలు. వీరికి తనుశ్రీ (11), తేజశ్రీ (8) కుమార్తెలు. తిరుపతిలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల స్వగ్రామం వచ్చారు. గురువారం మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లివద్దామంటూ స్కూటరుపై భార్యా పిల్లలను తీసుకుని కొనే బోయిన ఇండ్లు రింగురోడ్డు సమీ పంలో బావి దగ్గరికి తీసుకెళ్లి అందులోకి వారిని తోసేశాడు. 
 
ఆ తర్వాత భార్య చిన్నకుమార్తె మృతదేహాలను గట్టుకు లాగాడు. అంతలో సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న కొందరు గమనించడంతో చాకుతో గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి గిరిని ఆస్పత్రికి తరలించారు. తనుశ్రీ మృతదేహాన్ని అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సాయంతో వెలికి తీశారు. సీఐ సుదర్శన ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments