రాజస్థాన్ రాష్ట్రంలో ఝుంఝునులోని కుమావాస్ గ్రామంలో ఓ వ్యక్తి వీధి కుక్కలను వెంటాడి వెంటాడి 25 కుక్కలను చంపేసాడు. తుపాకీ తీసుకుని ద్విచక్ర వాహనంపై ఎక్కి తన గ్రామ పరిధిలో వున్న వీధి కుక్కలను వేటాడి అన్నిటినీ కాల్చి చంపేసాడు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జైపూర్ లోని కుమావాస్ అనే గ్రామంలో ష్యోచంద్ అనే వ్యక్తి తన గ్రామంలో వున్న కుక్కలను తుపాకీతో కాల్చడం ప్రారంభించాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగినవారితో... ఆ కుక్కలు తమ మేకలను చంపేస్తున్నాయనీ, అందువల్ల తనకు కుక్కలను చంపడం తప్ప వేరే మార్గం కనిపించలేదని చెపుతున్నాడు.
ఇదిలావుంటే జంతుహింస-ఆయుధాల చట్టం కింద ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.