Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీలో తన భార్యతో అలా ప్రవర్తించాడని ఇనుప రాడ్‌తో తలపై కొట్టి...

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (13:13 IST)
తనతో పనిచేసే కొలీగ్స్‌తో ఎంజాయ్ చేయడం అతనికి అలవాటు. వారం మొత్తం కష్టంపడే భర్త వారానికి ఒక్కసారి మాత్రమే తాగుతూ ఉండడంతో ఆ భార్య కూడా నో చెప్పలేదు. బయట ఎక్కడా వద్దు..ఇంటికి వచ్చి ఇక్కడే కూర్చుని తాగండి అంటూ భర్తను కోరేది భార్య. భార్య అలా చెప్పడంతో తన స్నేహితులను ఇంటికే పిలిపించుకుని ఎంజాయ్ చేసేవాడు భర్త. కానీ ఆ స్నేహితులే తనను మోసం చేస్తారని ఊహించలేదు.

 
తమిళనాడు రాష్ట్రం విరూద్ నగర్ లోని కారియాపట్టి ప్రాంతానికి చెందిన బాబు ఐదేళ్ళ క్రితమే వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే కొడుకును బాబు తల్లి చూసుకుంటోంది. ఒక ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తున్న బాబుకు ఈమధ్యే మద్యం అలవాటైంది. ఫ్రెండ్స్‌తో జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అయితే భర్త ఎప్పుడూ బిజీగా ఉండడం.. సెలవు రోజు కూడా బయటకు వెళ్ళిపోతూ ఉండటంతో భార్య ఒక షరతు పెట్టింది.

 
ఇంట్లో మందు తాగండి అని కోరింది. మీకు కావాల్సినవి నేనే చేసిపెడతానంది. మొదట్లో ఒక్కడే కూర్చుని తాగే బాబు ఆ తరువాత ఫ్రెండ్స్‌ను పిలవడం ప్రారంభించాడు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వారితో కూడా కలిసి తాగేవాడు. కానీ ఈ మధ్య ఒక స్నేహితుడు మద్యం తాగిన తరువాత బాబు భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న బాబు తెలుసుకోలేకపోయాడు. కానీ చివరకు భార్య ద్వారా విషయం తెలుసుకున్నాడు.


ఆ స్నేహితుడు సెంథిల్‌ను మళ్ళీ ఇంటికి పిలిపించుకున్నాడు. మద్యం తాగాడు. కోపంతో అతని తలపై రాడ్‌తో కొట్టాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన సెంథిల్ చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments