వైద్యానికి వచ్చిన యువతిపై కంపౌండర్ అత్యాచారం.. ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 8 సెప్టెంబరు 2025 (10:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యానికి వచ్చన ఓ యువతిపై ఆ ఆస్పత్రిలో పని చేసే మేల్ నర్స్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు కరీంనగర్ మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి ఓ యువతి తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం రాత్రి తల్లితో కలిసి వచ్చింది. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడే పడుకుంది. తల్లి పక్కన వెయిటింగ్ హాల్లో నిద్రించారు. ఈ క్రమంలో మేల నర్సుగా పనిచేస్తున్న ఓ యువకుడు యువతికి తెల్లవారుజామున మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారం చేశాడు. 
 
బాధితురాలికి మెలకువ వచ్చిన తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని తల్లితో చెప్పడంతో ఆమె విషయం గ్రహించి ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అత్యాచారం జరిగిందా? లేదా? అనేది విచారణలో తేలుస్తామని సీఐ తెలిపారు. యువతిని వైద్య పరీక్షలకు తరలించామని, ఆసుపత్రి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే నిందితుడుని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకునివున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments