ప్రియుడిచ్చే పడక సుఖం కోసం భర్తను కుమార్తెను చంపేసిన మహిళ

ఠాగూర్
గురువారం, 4 సెప్టెంబరు 2025 (09:29 IST)
కట్టుకున్న భర్త ఇచ్చే పడక సుఖం కంటే ప్రియుడి సుఖం కోసం పరితపించిన ఓ మహిళ.. భర్తతో పాటు కన్నబిడ్డను కూడా చంపేసింది. తన వివాహేతర సంబంధానికి భర్త, కుమార్తె అడ్డుగా ఉన్నారని భావించి ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
గత నెల 28న జిల్లాలోని కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో కమలాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. చుట్టుపక్కల క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కాటారం డీఎస్పీ సూర్యనారాయణతోపాటు సీఐ నాగార్జునరావు, ఎస్ఐ ఆకుల శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, అక్కడ లభించిన ఆధారాల ప్రకారం మృతి చెందిన యువతి చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22)గా గుర్తించారు. 
 
అయితే అదే నెల 6న చిట్యాల పోలీస్ స్టేషనులో తన కూతురు కనిపించడం లేదని తల్లి కప్పల కవిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాటారం మండలం గంగారం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై కవిత, మరో వ్యక్తి ఇద్దరూ కలిసి వస్తుండగా వారిని ఆపేందుకు పోలీసులు
ప్రయత్నిస్తుండగా పారిపోయేందుకు చూశారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. 
 
తండ్రి కప్పల కుమారస్వామి మొదటి భార్య మృతి చెందగా, 20 ఏళ్ల కిందట తాడిచర్ల మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన కవితను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురుకు వివాహం చేశారు. దీంతో చిట్యాల మండల ఒడితల గ్రామంలోనే పెద్ద కూతురు కప్పల వర్షిణి, తల్లి కవిత, తండ్రి కుమార స్వామి నివసిస్తున్నారు. 
 
ఐదేళ్ల కిందట కుమారస్వామికి పక్షవాతంతో ఇంటికే పరిమితమైయ్యాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన జంజర్ల రాజ్ కుమార్ కవితకు పరిచయం కావడంతోపాటు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన భర్త పలుమార్లు మందలించాడు. దీంతో రెండు నెలల క్రితం భర్తను, గత నెల 3వ తేదీన కుమార్తెను తన ప్రియుడుతో కలిసి హత్య చేసినట్టు విచారణలో నేరాన్ని అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments