సోషల్ మీడియాలో పోస్టులు... యువకుడు కిడ్నాప్ - దారుణ హత్య

ఠాగూర్
ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (11:18 IST)
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తనను దూషిస్తూ ఇన్‌స్టా, వాట్సాప్ ఖాతాల్లో పోస్టులు పెడుతున్నాడన్న అక్కసుతో కొందరు యువకులు ఆ యువకుడుని కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ ఘోరం తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లిలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... భూపాలపల్లి రాజీవ్ నగర్ వాసి ఎండీ బాసిత్ (20)కు, శాంతినగర్‌కు చెందిన రడపాక భాస్కర్, బుస్స ప్రశాంత్, గాజుల కుషాల్ మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. రెండు నెలల క్రితం బాసిత్‌పై వీరు దాడి చేశారు. దీంతో వారిపై పగ పెంచుకున్న బాసిత్ సోషల్ మీడియాలో వారిని కించపరిచేలా పోస్టులు పెట్టడం ప్రారంభించాడు. ఇది సహించలేకపోయిన ఆ ముగ్గురూ మరో ముగ్గురు స్నేహితులు పందిళ్ల శ్రవణ్, బరిగల ప్రణయ్, చొప్పరి నవీన్ సహాయంతో బాసిత్ను అంతమొందించాలని పక్కా ప్లాన్ వేశారు.
 
ఈ నెల 4న బాసిత్ తన స్నేహితుడు అరుణ్ కలిసి బైకుపై వెళ్తుండగా నిందితులు అడ్డగించి దాడి చేశారు. అనంతరం బాసిత్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అతని చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపేశారు. ఆధారాలు దొరక్కుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
 
బాసిత్‌తో పాటు ఉన్న స్నేహితుడు అరుణ్ ఇచ్చిన సమాచారం, సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండు తరలించినట్టు డీఎస్పీ సంపత్ రావు తెలిపారు. కాగా, మృతుడు బాసిత్‌పై  కూడా గతంలో గంజాయి, చైన్ స్నాచింగ్ కేసులు నమోదైవున్నాయని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments