Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయిన 11 నెలల బాలుడు

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (15:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 11 నెలల బాలుడు నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కథన వివరాలను పరిశీలిస్తే, రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన ఎక్కల దేవీ లక్ష్మణ్, గీత దంపతులు కట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
సోమవారం సాయంత్రం దంపతులిద్దరు కుట్టుపనిలో నిమగ్నం కాగా, వారి చిన్న కుమారుడు హేమంత్ (11నెలలు) అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో హేమంత్ పక్కనే ఉన్న నీటి బకెట్ వద్దకు వెళ్లి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. అప్పటివరకు అక్కడే ఆడుకుంటున్న తమ కుమారుడు కనిపించకపోవడంతో తల్లి కంగారు పడుతూ వెతకడం మొదలు పెట్టింది. 
 
ఈ క్రమంలో నీటి బకెట్లో పడి శ్వాస తీసుకోలేక విలవిలలాడుతుండడాన్ని తల్లి చూసింది. దీంతో వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అప్పటివరకు తల్లిదండ్రుల ముందే సరదాగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి ఇక లేడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments