ఇంట్లో పనికి పెట్టుకున్న టీనేజ్ బాలికపై యజమానుల చిత్రహింసలు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (09:54 IST)
తమ ఇంట్లో పాచిపని చేసేందుకు పెట్టుకున్న టీనేజ్ బాలికను ఇంటి యజమానులు చిత్రహింసలకు గురిచేశారు. లైంగికంగా వేధించారు. బాలికను కొట్టి, కుక్కలతో కరిపించి, దుస్తులు తొలగించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణం గురుగావ్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తనకు తెలిసినవారి ద్వారా తన 13 యేళ్ల కుమార్తెను గురువావ్‌లోని సెక్టార్ 57లో ఉండే శశిశర్మ అనే వ్యక్తి ఇంటిలో పని చేసేందుకు పెట్టింది. ఆ బాలికకు నెలకు రూ.9 వేలు వేతనం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
మొదటి రెండు నెలలు అంతా సాఫీగానే సాగిపోయింది. ఆ తర్వాతే ఇంటి యజమాని శశిశర్మతో సమస్యలు మొదలయ్యాయి. ఆ టీనేజ్ బాలికపై ఇంటి యజమానులు చిత్రహింసలకు గురిచేశారు. బాలికను కొట్టి, కుక్కలతో కరిపించి, దుస్తులు తొలగించి, అసభ్యంగా ప్రవర్తించారు. ఓ రోజున కుమార్తెను చూసేందుకు వెళ్లగా, తన కుమార్తె ఓ గదిలో బందీగా కనిపించింది. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక నోటికి టేపు వేశారని, రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం పెట్టేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
 
శశి శర్మ భార్య తన కుమార్తెను ఇనువ రాడ్డుతో కొట్టేందని, వాళ్ల కుమారుడు తన కుమార్తె దుస్తులు తొలగించి అసభ్యంగా తాకుతూ కెమెరాతో వీడియో చిత్రీకరించారని వాపోయింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం