Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 చెంప దెబ్బలు కొట్టిన టీచర్.. ఎలుకల మందు ఆరగించి విద్యార్థి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (17:34 IST)
సహచర విద్యార్థుల ముందు క్లాస్ టీచర్ ఓ విద్యార్థిని 23 సార్లు చెంప దెబ్బలు కొట్టాడు. దీన్ని అవమానంగా భావించాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వైట్‌ఫీల్డ్ సమీపంలోని చన్నసంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాఠశాల డైరీలో సూచనలు రాసి తల్లిదండ్రులకు పంపమని టీచర్‌ను విద్యార్థి కోరాడు. అయితే, విద్యార్థి మధ్యలో కలుగజేసుకుని మాట్లాడినందుకు ఉపాధ్యాయుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విద్యార్థిని 23 సార్లు చెంపపై కొట్టాడు. దీంతో చెంపకు కూడా గాయమైంది. చిన్నారు చెంపపై వాపు కనిపించడాన్ని తల్లి గుర్తించి ఏమైందని ప్రశ్నించగా, జరిగిన విషయమంతా చెప్పాడు. 
 
తల్లి వెంటనే చిన్నారి తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని వివరించింది. దీంతో మరుసటి రోజు స్కూలుకు వెళ్లి పాఠశాల యాజమాన్యానికి విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు. 30 నిమిషాల్లో 23 సార్లు కొట్టాడని, అందువల్ల ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. దీంతో సదరు యాజమాన్యం ఆ టీచర్‌ను ఇంటికి పంపించాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. గత వారమే సదరు గురువుకు వివాహం జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments