ప్రియుడితో భార్య ఫోటో... చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్న భర్త.. ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 1 డిశెంబరు 2025 (09:46 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తనకు దూరంగా ఉంటున్న భార్య... అమె ప్రియుడుతో ఫోటో దిగడాన్ని జీర్ణించుకోలేని ఓ భర్త.. ఆమెను కర్కశంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహం పక్కన కుర్చీ వేసుకుని కూర్చొని భార్య శవంతో సెల్ఫీ తీసుకుని, దాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ స్టేటస్‌కు నమ్మకద్రోహానికి తగిన సన్మానం అంటూ క్యాప్షన్ జోడించాడు. నవంబరు 30వ తేదీ ఆదివారం కోవైలోని ఓ హాస్టల్‌లో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరునెల్వేలి జిల్లాకు చెందిన బాలమురుగన్ అనే వ్యక్తికి శ్రీప్రియ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా శ్రీప్రియ భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె జిల్లా కేంద్రమైన కోయంబత్తూరుకు వచ్చి గాంధీపురంలో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ, రత్నపురిలో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. ఈ క్రమంలో తన భార్య ప్రవర్తనపై బాలమురుగన్‌కు అనుమానం వచ్చింది. అదేసమయంలో శ్రీప్రియ ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పైగా, అతనితో ఫోటోలు కూడా దిగింది. ఈ ఫోటోలను చూసిన బాలమురుగన్ జీర్ణించుకోలేకపోయాడు. 
 
వెంటనే తిరునెల్వేలి నుంచి కోయంబత్తూరులో తన భార్య ఉండే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీప్రియ.. తన గది నుంచి బయటకు వచ్చి, భర్తతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో భార్యాభార్తలు గొడవపడగా, నిగ్రహం కోల్పోయిన బాలమురుగన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేసి, గొంతుకోశాడు. 
 
ఆ తర్వాత భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహం పక్కన కుర్చీ వేసుకుని కూర్చొని మృతదేహంతో సెల్ఫీ తీసుకుని, దాన్ని వాట్సాప్ సెల్ఫీగా పెట్టుకుని, నమ్మక ద్రోహానికి తగిన సన్మానం అంటూ క్యాప్షన్ పెట్టుకున్నాడు. సమాచారం అందుకున్న రత్నపురి పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, అక్కడే ఉన్న నిందితుడు బాలమురుగన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments