Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

వరుణ్
సోమవారం, 15 ఏప్రియల్ 2024 (11:57 IST)
కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యా సంస్థలో చదువుకునే ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ట్రిపుల్ ఐటీలో ప్రకాశం జిల్లా కంభం మండలం, జంగుంట్ల గ్రామానికి చెందిన కుర్రి రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది.
 
ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది సాయంతో ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, చివరి సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు కూడా పూర్తికావడంతో మరో పది రోజుల్లో ఇంటికి వెళ్లాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, హాటల్ వార్డెన్ షరీఫ్ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే, మృతురాలి మొబైల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments