కామారెడ్డిలో కన్న కొడుకు ఘాతుకం... తల్లిని చంపి పాతిపెట్టిన తనయుడు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (13:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో దారుణం జరిగింది. కన్నతల్లిని చంపిన కిరాతకంగా చంపేసిన కుమారుడు.. శవాన్ని కూడా ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్ట బోయిన బాలవ్వ (80) అనే వృద్ధురాలు ఉంది. ఈమె వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది. దీంతో అన్ని రకాల సేవలతో పాటు సపర్యలను చిన్న కుమారుడు బాలయ్య చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో బాలయ్యకు సేవలు చేయలేక కన్నతల్లిని ఈ నెల 13వ తేదీన గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత గుట్టుచప్పుడుకాకుండా తల్లి శవాన్ని మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుకు ఓ ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా, తన తల్లి అదృశ్యమైందంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
అయితే, చిన్న కుమారుడు బాలయ్యపైనే అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక ఎంపీటీసీ బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో మృతురాలు శవానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా అసలు నిజం తేలింది. ఈ కేసులో బాలయ్యను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments