Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ భర్త వద్దు అంటున్నావు కదా నాతో ఉండు: మహిళ ఆరోపణ

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (22:29 IST)
భర్త వేధిస్తున్నాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై సానుభూతి చూపించాల్సిన ఎస్ఐ వేధించటం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై డీజీపీ కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

కృష్ణాజిల్లా కలిదండ ఎస్ఐ పదేపదే స్టేషన్కు పిలుస్తూ సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు కొక్కిలిగడ్డ లక్ష్మీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం మంగళగిరిలోని డిజిపీ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదు చేసేందుకు వచ్చింది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె భర్తపై ఫిర్యాదు చేస్తే ఎస్సై తనని స్టేషన్ ఒకరోజు రాత్రంతా స్టేషన్లోనే ఉంచాడని ఆరోపిస్తోంది. మీ భర్త వద్దు అంటున్నావు కదా నాతో ఉండు నిన్ను నేను ఏ లోటు లేకుండా చూసుకుంటా అని పదే పదే ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపింది.

అదేమిటని అడిగితే తనపై కేసు నమోదు చేశారని తెలిపింది. సిఐ దృష్టికి తీసుకెళ్తే ఎస్సైకి మద్దతుగా మాట్లాడుతున్నారని తెలిపింది. తనకు న్యాయం చేసి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకునేందుకు డిజిపి ఆఫీసుకు వచ్చానని తెలిపింది.

శనివారం కావడంతో కార్యాలయానికి సెలవు అని ఫిర్యాదు సేకరించేందుకు సోమవారం రావాలని బాధితురాలిని డీజీపీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడటం గమనించిన వారు ఆమెను పిలిపించి ఫిర్యాదు స్వీకరించటం గమనార్హం. ఫిర్యాదుపై విచారించి ఎస్సైపై చర్యలు తీసుకుంటామని డిజిపీ కార్యాలయంలో అధికారులు హామీ ఇచ్చారని ఆమె తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments