Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచరు కాదు కామాంధుడు.. క్లాస్ రూమ్‌లో బాలికలకు నీలి చిత్రాలు...

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (10:21 IST)
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఓ కామాంధ టీచర్ నీచంగా ప్రవర్తించాడు. తరగతి గదిలోనే తన వద్ద చదవుకునే విద్యార్థినులకు నీలి చిత్రాలు చూపిస్తూ పైశాచికానందం పొందసాగాడు. అయితే, అతని పాపం పండటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సత్తెనపల్లి 17వ వార్డులోని శాలివాహన నగర్‌లో ఎంపీపీఎస్ (ఉర్దూ) పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక తనకు తలనొప్పిగా ఉందని రాత్రి తన తల్లితో చెప్పింది. దీంతో ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయింది.
 
ఉపాధ్యాయుడు హుస్సేన్ బూతు చిత్రాలు చూపిస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ బోరున విలపించింది. దీంతో ఆమె ఆరా తీయగా మరికొందరు బాలికలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బాలికల తల్లిదండ్రులు వెంటనే నిందితుడైన ఉపాధ్యాయుడు హుస్సేన్‌కు ఫోన్ చేయగా దురుసుగా మాట్లాడాడు.
 
దీంతో వారందరూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. హుస్సేన్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. పోలీసుల హామీతో ఆ తర్వాత వారు ఆందోళన విరమించారు. మరోవైపు, ఈ ఘటనపై డీఈవో గంగాభవాని స్పందించారు. బాధితుల ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments