Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాలు.. ఆలి.. కన్నబిడ్డను చంపేసి.. ఆతడూ ఆయువు తీసుకున్నాడు... ఎక్కడ?

lingaraju family
Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (10:25 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక కష్టాలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. కట్టుకున్న భార్య, కన్నబిడ్డను చంపేసిన వ్యక్తి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి తోయపుట్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తోయపుట్‌కు చెందిన లింగరాజు బిశోయ్ (27) స్థానికంగా మొబైల్ షాపును నడుపుతున్నాడు. ఈయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. కుటుంబ జీవనం కోసం అప్పులు చేయసాగాడు. ఈ అప్పులు కూడా పెరిగిపోయాయి. దీంతో దిక్కుతోచనిస్థితిలో ఏం చేయాలో తెలియలేదు. తాను మాత్రమే ఆత్మహత్య చేసుకుంటే భార్యా, కుమార్తె ఒంటరివారే పోతారని భావించారు. 
 
అందుకే ముందుగా భార్య జ్యోత్స్న (24) మెడకు మొబైల్ చార్జర్ వైరు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ళ కుమార్తె గొంతుకు తాడు చుట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మరుసటి రోజు వారి కదలికలు లేకపోవడంతో పొరుగింటివారు రాత్రి 9 గంటల సమయంలో వెళ్లి తలుపు తట్టారు. 
 
అయినప్పటికీ ఎలాంటి శబ్ధం లేకపోవడంతో గ్రామంలోని వారందరూ కలిసి తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఇంట్లో విగతజీవులై కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారమ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments