Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్లో గుడ్డలు కుక్కి.. నర్సుపై సామూహిక అత్యాచారం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (12:39 IST)
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. నర్సును కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కిన నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వీరిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నలుగురు నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. 
 
రాష్ట్రంలోని మహేంద్రగఢ్ జిల్లా ఛిప్‌చిపీ గ్రామంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ హెల్త్ సెంటరులో నర్సు ఒంటరిగా ఉందని గమనించిన నలుగురు దుండగులు అదే దావఖానలోకి చొరబడి ఆమెను కట్టేశారు. ఆ తర్వాత ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. తర్వాత నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్నంతా వీడియో తీశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని నర్సును బెదిరించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాల్లో ఈ దారుణం జరిగింది. 
 
దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుల్లో ముగ్గురిని అరెక్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నలుగురు కామాంధుల్లో ఒకరు 17 యేళ్ల మైనర్ బాలుడు కావడం గమనార్హం. ఈ ఘటనపై ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. "మాకు భద్రత కావాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే మేం విధులకు హాజరుకాబోము" అని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments