Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయ్యింది, శోభనం వద్దన్న భార్య, వెక్కి వెక్కి ఏడ్చిన భర్త, చివరకు?

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (10:37 IST)
నాకు భయంగా ఉంది. శోభనం అంటే తెలియని భయం లోలోపల కనిపిస్తోంది. శోభనాన్ని వాయిదా వేద్దామని పెళ్ళికూతురు భర్తకు చెప్పింది. మొదటి రోజు కదా భార్య భయపడుతూ ఉంటుందిలే అనుకున్నాడు భర్త. ఇలా ఒకటి కాదు రెండు కాదు 8 రోజుల పాటు చెబుతూనే వచ్చింది భార్య. ఆ తరువాత జరిగిన విషయాన్ని తలుచుకుని భర్త వెక్కి వెక్కి ఏడిపిస్తున్నాడు. 

 
రాజస్థాన్ లోని పోఖ్రాన్‌లో నివాసముంటున్న బాబూరామ్ అనే యువకుడు ఈనెల 19వ తేదీ శాంతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. జగ్మల్ సింగ్ అనే మధ్యవర్తి ద్వారా ఈ వివాహం జరిగింది. శాంతి అనాధ. ఎవరూ లేరు. హాస్టల్‌లో పెరిగింది. బాబూరామ్‌కు కుటుంబ సభ్యులు ఉన్నా కూడా ఒక అనాధను పెళ్ళి చేసుకోవాలని భావించి శాంతిని వివాహం చేసుకున్నాడు.

 
శాంతి అసలు స్వరూపం బాబూరామ్‌కు తెలియదు. వివాహం  జరిగింది. ఇక శోభనానికి పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శాంతి, బాబూరామ్ దగ్గరకు వెళ్ళి శోభనం అంటే నాకు ఎందుకో భయం కలుగుతోంది. ఈ రోజు వాయిదావేద్దాం.. ఆ తరువాత ముహూర్తం పెట్టుకోండి అని భర్తను కోరింది. దీంతో సరేనన్నాడు భర్త. ఇలా 8 రోజులు గడిచాయి. భార్య అదే పనిగా వద్దు వద్దు అని ఎందుకు చెబుతుందో అర్థం కాలేదు.

 
నిన్న ఉద్యోగం నిమిత్తం బాబూరామ్ బయటకు వెళ్ళి సాయంత్రం ఇంటికి రాగా శాంతి ఇంటిలో లేదు. ఇంటిలోని నగలు, డబ్బులు కూడా కనిపించకుండా పోయాయి. దీంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఆమె వివరాలు చూసిన పోలీసులు... శాంతి కిలాడీ లేడి అని, పెళ్ళిళ్ళు చేసుకుని మోసం చేసి ఉడాయిస్తుందని చెప్పారు. దీంతో పోలీసు స్టేషన్ లోనే బాబూరామ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అతడిని పోలీసులు సముదాయించారు. కిలాడీ లేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments