నవీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ప్రియురాలి మొబైల్‌లో..

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (10:04 IST)
తెలంగాణా రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్‌మేట్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హత్య కేసులో ఇప్పటివరకూ ఒక్కో రోజు ఒక్కో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిల్‌సుఖ్‍‌ నగర్‌‍లోని ఐడియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివే సమయంలోనే నవీన్, ఓయువతి ప్రేమించుకున్నారు. కొంతకాలం సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత వారిమధ్య గొడవలు జరగడంతో వారు విడిపోయారు. ఈ సమయంలో ఆ అమ్మాయికి హరికృష్ణ పరిచయమై, లవ్ ప్రపోజ్ చేయగా ఆమె పచ్చజెండా ఊపింది. ఆ తర్వాత నవీన్ తన మాజీ ప్రియురాలికి పదేపదే ఫోన్లు చేయసాగాడు. 
 
ఈ విషయం హరికృష్ణకు తెలిసి నవీన్‌పై కక్ష పెంచుకుని అతన్ని అంతమొందించాలని ప్లాన్ చేసి, తాను అనుకున్నట్టుగానే హత్య చేశాడు. ఈ విషయాలను పోలీసులు తయారు చేసిన ఎఫ్ఐఆర్‌లో పూసగుచ్చినట్టు వివరించారు. నవీన్‌ను హరికృష్ణ ఏ విధంగా హత్య చేశారన్న విషయాన్న పోలీసులు వివరంగా పేర్కొన్నారు. నవీన్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన హరికృష్ణ.. అతడిని బైకుపై నుంచి కిందపడేశాడు. అతను తేరుకునేలోపు గొంతు నులిమి హత్య చేశాడు. 
 
ఆ తర్వాత కత్తితో మెడ కోసి, తలను మొండెంను వేరు చేశాడు. ఆ తర్వాత మర్మాంగాన్ని కోసేసి నవీన్ శరీరం నుంచి గుండెను బయటకు తీశాడు. చేతి వేళ్లను కూడా కట్ చేసి అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు. బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో కూడా హరికృష్ణ చేతికి గ్లౌజ్‌లు వేసుకునివున్నాడు. పైగా, హత్యకు ముందుగానే నిందితుడు పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments