పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (14:55 IST)
భార్యా బాధితులు ఎక్కువగా కర్నాటక రాష్ట్రంలోనే వున్నట్లుగా వరుసగా ఆ రాష్ట్రంలో భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మరో విషాదకర సంఘటన జరిగింది. తన భార్య పింకీ వేధిస్తోందనీ, ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె భర్త సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
ఈ విషాదకర పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని హుబ్బళ్లికి చెందిన పీటర్ తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. తన మరణానికి తన భార్య పింకీ కారణమనీ, తన తల్లిదండ్రులు తను ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించమని వేడుకున్నాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు మాట్లాడుతూ... పీటర్, పింకీలకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇటీవలే ఏదో విషయమై వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో గత 3 నెలలుగా ఇద్దరూ విడిగా వుంటున్నారు. పింకీ కారణంగా తన సోదరుడి ఉద్యోగం కూడా పోయింది.
 
పింకీ తనకు భరణంగా 20 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేయడంతో పీటర్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ బోరుమంటూ విలపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పీటర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం పింకీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments