Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆత్మహత్యకు నా భర్తే కారణం... గోడపై రాసి ప్రాణాలు తీసుకుంది...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (15:31 IST)
నా చావుకు నా భర్తే కారణం అంటూ గోడపై రాసిమరీ ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గణాలోని ఫతేగఢ్‌కు చెందిన 42 యేళ్ల ఉమ అలియాస్ జ్యోతి అగర్వాల్‌కు ఫతేనగర్‌కు పురుగుల మందు వ్యాపారి దీపక్ అగర్వాల్ అనే వ్యక్తితో 11 నెలల క్రితం వివాహమైంది. కొంతకాలంపాటు వీరి సంసారం సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో దీపక్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఆరంభమయ్యాయి. మరోవైపు, దీపక్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆత్మహత్య చేసుకునేముందు తనపై జరిగిన చిత్ర హింసల గురించి గోడలపై రాసింది. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, కోటాలో నివసిస్తున్న ఓ మహిళ తన సంసారంలో నిప్పులు పోసిందని, తన చావుకు భర్తే కారణమని ఆమె గోడపై రాసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments