కులాంతర ప్రేమ వివాహం.. మేడ్చల్‌లో యువకుడి దారుణ హత్య

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (17:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్ జిల్లా దూలపల్లికి చెందిన హరీశ్ అనే యువకుడు కొన్ని నెలల క్రితం దూలపల్లికి వచ్చి ఇల్లు కట్టుకుని తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈయన గతంలో ఆయన ఎర్రగడ్డలో ఉండేవాడు. ఆ సమయంలో ఆయన వేరే వర్గానికి చెందిన యువతితో ప్రేమించాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసుల ద్వారా యువకుడిని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన మకాం మార్చినప్పటికీ ఆ యువతితో ప్రేమను కొనసాగించి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఆ యువకుడు రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. నలుగురు యువకులు వచ్చి హరీశ్‌ను కత్తుతో పొడిచి చంపినట్టు పలువురు  ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఆ తర్వాత ఆ మృతదేహం హరీశ్‌గా గుర్తించారు. వేరే వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడంతో హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో యువతి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments