Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (09:47 IST)
ఆ ఇంటి పెద్ద (భర్త) ఊరెళ్ళి వచ్చేసరికి భార్య, కుమార్తెలు అనుమానాస్పదస్థితిలో శవాలై కనిపించారు. గొంతు కోసిన స్థితిలో కుమార్తె, ఉరితాడుకు వేలాడుతూ భార్య ఉంది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. తాజా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి ఓ ఎరువుల ఫ్యాక్టరీలో సేల్స్ మేనేజరుగా పని చేస్తున్నారు. ఈయన భార్య రాజేశ్వరి(34), కుమార్తె వేదశ్రీ, వేద సాయిశ్రీ (13)తో కలిసి మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. సీతారాంరెడ్డి ఈ నెల 10వ తేదీన తన కార్యాలయ పని నిమిత్తం హైదరాబాద్ నగరానికి వెళ్లి శనివారం సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. 
 
అపుడే నిద్రలేచిన పెద్ద కుమార్తె వేదశ్రీ తలుపుతీసి అమ్మా, చెల్లి నిద్రపోతున్నారని చెప్పింది. దీంతో వేద సాయిశ్రీని నిద్రలేపేందుకు దుప్పటి తొలగించగా గొంతు కోసి చనిపోయివుంది. మరో గది లోపల గడియపెట్టి ఉండటంతో తలుపు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య రాజేశ్వరి ఉరికి వేలాడుతూ కనిపించింది. 
 
అలాగే, ఎడమచేతి మణికట్టు వద్ద నరం కోసి ఉంది. దీంతో కుప్పకూలిపోయిన సీతారాం రెడ్డి పోలీసులకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments