Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బాలికపై యువకుడి అత్యాచారం.. సోదరుడుకి కూడా పడక సుఖం

Webdunia
సోమవారం, 24 జులై 2023 (12:58 IST)
ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో ఓ బాలికను యువకుడు మోసం చేశాడు. ఏకాంతంగా మాట్లాడుకుందామని లాడ్జీకి బాలికను తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన సోదరుడిని కూడా పిలిపించి అత్యాచారం చేయించాడు. ప్రేమ పేరుతో తనకు జరిగిన మోసాన్ని గ్రహించిన ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లాలోని పామర్రు సమీపంలోని ఓ దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే ఆ బాలికపై కొండిపర్రుకు చెందిన లోకేశ్ అనే యువకుడు కన్నేశాడు. ప్రేమ పేరుతో వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. లోకేశ్ మాటలు నమ్మిన మైనర్ బాలిక అతడితో చనువు పెంచుకుంది. 
 
ఈ నెల 20వ తేదీన లోకేశ్ బాలికకు ఫోన్ చేసి ఇద్దరం కలిసి ఏకాంతంగా గడుపుదామని కోరాడు. అందుకు తొలుత బాలిక ఒప్పుకోలేదు. ఏలాగోలా బతిమిలాడి ఒప్పించాడు. ఎక్కడ కలవాలో అడ్రస్ కూడా చెప్పాడు. దీంతో బాలిక రోజులాగే స్కూల్‌కి వెళ్తున్నానని చెప్పి బ్యాగ్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. స్కూల్ బయట బ్యాగును వదిలేసి రోడ్డుపైకి వెళ్లింది. 
 
అక్కడ ఓ యువకుడిని లిఫ్ట్ అడిగి.. ప్రియుడు లోకేశ్ చెప్పిన విజయవాడ - మచిలీపట్నం నేషనల్ హైవే దగ్గరకు చేరుకుంది. అక్కడకు చేరుకున్న లోకేశ్ మైనర్ బాలికను బైక్ ఎక్కించుకుని ఉయ్యూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. అనంతరం లోకేశ్ తనకు సోదురుడి వరుసయ్యే నరేంద్రకు ఫోన్ చేసి తాను ఉన్న లాడ్జికి రావాలని అడ్రస్ షేర్ చేశాడు. 
 
నరేంద్ర వచ్చిన తర్వాత ఇద్దరూ మరోసారి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అవమానం తట్టుకోలేక.. ప్రియుడి మోసాన్ని భరించలేక ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం