Webdunia - Bharat's app for daily news and videos

Install App

వద్దన్నా బయటకెళ్లిన భర్త.. కోపంతో భార్య ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (15:50 IST)
తాను చెప్పిన మాట వినకుండా భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడన్న కోపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఏపీలోని గుంటూరు నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు పట్టణంలోని కళ్యాణి నగర్ ప్రాంతానికి చెందిన నాగూర్ బాషా, జ్యోత్స్న ఐదు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. 
 
వృత్తిలో భాగంగా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ, పెళ్లి వరకు దారితీసింది. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ వచ్చారు. అయితే, వారిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఇద్దరి జీవితాల్లో పెను విషాదం నింపించిద. బయటకు వెళ్లొద్దని చెప్పిన తన మాట భర్త వినకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. 
 
తన కుమార్తెతో మాట్లాడేందుకు జ్యోత్స్న తల్లి ఫోన్ చేయగా, ఆమె ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అల్లుడుకి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లి చూడగా భార్య ఫ్యానుకు ఉరేసుకునివుంది. దీంతో బోరున విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments