Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐను కాల్చి చంపేసిన కానిస్టేబుల్.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 3 నవంబరు 2024 (16:51 IST)
ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డారు. సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐ‌ను కాల్చి చంపేశాడు. ఈ దారుణం మణిపూర్ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో గత కొంతకాలంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోని రెండు తెగలకు చెందిన ప్రజల మధ్య ఈ ఘర్షణలు  చోటు చేసుకుంటున్నాయి. దీంతో పలు గ్రామాల్లో పోలీస్ పోస్టులు ఏర్పాటు చేసి హింస చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో జిరిబామ్ జిల్లా మాంగ్ బంగ్ గ్రామంలోని పోలీస్ పోస్ట్‌లో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్, ఎస్ఐ షాజహాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య శనివారం తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ముదరడంతో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఎస్ఐ కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిప్రాణాలు కోల్పోయాడు. 
 
తుపాకీ శబ్దం వినిపించిన మిగిలిన పోలీస్ సిబ్బంది బిక్రమ్ జిత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, కానిస్టేబుల్, ఎస్ఐల మధ్య కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

లక్ష రూపాయలు గెలుచుకోండంటూ డియర్ కృష్ణ వినూత్న కాంటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో M4M హిందీ ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments